YouVersion Logo
Search Icon

Plan Info

కఠినమైన త్రోవలలో పొంగిపొరలే అనుభవం Sample

కఠినమైన త్రోవలలో పొంగిపొరలే అనుభవం

DAY 5 OF 7

అంతఃపురంలో పొంగిపొరలే ప్రవాహం యోసేపును ఫరో రాజు వద్దకు తీసుకొనివచ్చారు. ఫరోకు వచ్చిన కలలను అతడు ఖచ్చితంగా వివరించాడు, ఏడు సంవత్సరాల పుష్కలంగా పంటపండుతుంది, తరువాత ఏడు సంవత్సరాల తీవ్రమైన కరువు, అనావృష్టి కలుగుతుందని ఆ కలలు తెలియపరుస్తున్నాయి.  తననుండి రాజు అడిగిన దానికి మించి యోసేపు జ్ఞానయుక్తంగా రాబోయే కరువును ఎదుర్కోవడానికి ఫరో అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికను కూడా సూచించాడు. వ్యవహారదక్షకుడిగా ఉన్న ఫరో, యోసేపు వివరించిన కార్యాచరణ ప్రణాళికను కార్యరూపంలో ఉంచడానికి యోసేపునే బాధ్యుడిగా ఉండడానికి ఎన్నిక చేసి, వెంటనే దేశంలోనే రెండవ అధికారిగా నియమించాడు.  ఒక్క రాత్రిలోనే యోసేపు అక్షరాల మురికిగుడ్డల నుండి సంపదల స్థానంలోనికి వెళ్ళాడు. యోసేపు నాయకత్వంలో భవిష్యత్తు కోసం ఐగుప్తు సిద్ధపడడం ఆరంభించింది. చక్రవర్తి యోసేపు పేరును జప్నత్పనేహు అని మార్చాడు, అతడు యోసేపుకు ఐగుప్తీయుడైన ఓను అను యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతు నిచ్చి పెండ్లి చేసాడు. ఈ సమయంలో వారికి ఇద్దరు కుమారులు జన్మించారు. దేవుడు తన జీవితాన్ని పునరుద్ధరించే క్రమంలో యోసేపు అనేకసంవత్సరాల నిరీక్షణ ఫలించింది. దేవుడు యోసేపుకు ఒక నూతన కుటుంబాన్నీ, నూతన గృహాన్నీ, నూతన స్థాయి నాయకత్వాన్నీ ఇస్తున్నాడు.  యోసేపు తన ముందు ఉంచిన అవకాశాలను తీసుకోవడంలోనూ, అతని జీవితాన్ని ప్రారంభించడంలోనూ యోసేపు చూపిన సిద్ధబాటు దేవుని చేత నడిపించబడిన జీవితాన్ని కనపరుస్తుంది. అతడు తన కుమారులకు పేర్లు పెట్టాడు, మనష్షే అంటే "దేవుడు నా శ్రమనూ, నా తండ్రి ఇంటినీ మరచిపోయేలా చేసాడు" అని అర్థం, రెండవ కుమారుడు ఎఫ్రాయీము అంటే "కష్టాల దేశంలో దేవుడు నన్ను ఫలవంతం చేసాడు" దేవుడు తన జీవిత ప్రయాణానికి ఎంత కేంద్రంగా ఉన్నాడో ఈ మాటలు తెలియపరుస్తున్నాయి. మీ పురోగతి కేవలం ఒక రహస్యప్రదేశంలో మారుమూలన ఉండవచ్చు లేదా ఇది రహదారికి చాలా దూరంలో ఉండవచ్చు. ఏవిధంగా ఉన్నప్పటికీ విజయం మీదే. కఠినమైన మార్గాల ద్వారా పని చేయడం మీరు చూస్తారు, దేవుడు దానిలోనుండి మేలైనదానిని తీసుకొని వస్తాడు. సుదీర్ఘ నిరీక్షణలో ఆయన సన్నిధిని మీరు గుర్తిస్తారు, మీ పోరాటాలలో ఆయన విజయవంతమైన హస్తాన్ని చూస్తారు, మీ జీవితంలో ఆయన స్పర్శను చూడడంలో మధురమైన ఆనందాన్ని అనుభవిస్తారు. ఈ మధ్య కాలంలో మీ జీవితంలోని ప్రతి అంశం విషయంలోనూ – అది చిన్నదిఅయినా లేదా పెద్దది అయినా – ఆయన విశ్వసించండి. దేని గురించీ  చింతించవద్దు, అన్ని విషయాల కోసం ప్రార్థించండి, అన్ని సమయాలలో నిరీక్షణను హత్తుకొని ఉండండి.
Day 4Day 6

About this Plan

కఠినమైన త్రోవలలో పొంగిపొరలే అనుభవం

పొంగిపొర్లుతున్న అనుభవంలో నుండి నడవాలనీ, పని చేయాలనీ, ప్రేమించాలనీ, సేవించాలనీ మీరు ఈ రోజు తీర్మానించుకొంటారా? ఇతరులు మిమ్మల్ని చూసినప్పుడు, బాగా నీరు కట్టిన తోటనూ లేదా ఏ కాలంలోనైనా ఎండిపోని పొంగిపొరలే ఒక ఊటను వారు చూచేల...

More

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy