కఠినమైన త్రోవలలో పొంగిపొరలే అనుభవం Sample

అగాధంలో పొంగిపొరలి ప్రవహించడం
పితరుడైన యాకోబుకు యోసేపు పదకొండవ కుమారుడు, తండ్రి అతనిని ప్రత్యేక ప్రేమతోనూ, గౌరవంతోనూ చూసాడు. ఈ కారణంగా అతని సోదరులు యోసేపును అలక్ష్యం చేసారు. యోసేపు ఆత్మీయవరాలు కలిగియున్న కారణంగాకూడా అతని తండ్రి యోసేపుపట్ల పక్షపాతాన్ని చూపించడానికి కారణం అయ్యింది. ఫలితంగా యోసపుకూ అతని పదిమంది అన్నలకూ మధ్య విబేధం ఏర్పడింది. ఆదికాండము 37 లో ప్రస్తావించిన విధంగా రెండు సందర్భాలలో యోసేపు తన కలలను అజ్ఞానంగా తన సోదరులతో పంచుకొన్నాడు. దాని ఫలితంగా అతని సోదరుల ద్వేషానికీ, అసూయకూ యోసేపు బాధితుడు అయ్యాడు. వారు యోసేపుమీద దాడిచేసారు, తరువాత ఐగుప్తు వైపుకు వెళ్తున్న బానిస వర్తకులకు అతనిని అమ్మివేసారు.
యోసేపు యాకోబుకు అభిమాన కుమారుడు కాకపోతే, అతని సోదరులు యోసేపును ప్రేమించి, అతనిని అపహరించి బానిసగా పంపింఛియుండకపోయినట్లయితే ఏమి జరుగుతుందో ఊహించడం ఆసక్తికరంగా ఉంటుంది. దీని వెనుక ఉన్న “ఎందుకు లేదా ఏమిటి” అనేవి మనకు ఎప్పటికీ తెలియకపోయినా, యాకోబు వారసత్వం నెరవేరడానికీ, ఇశ్రాయేలు దేవుడు ఎన్నుకున్న జనాంగంగా స్థాపించబడడానికీ, యోసేపు ఐగుప్తుకు వెళ్ళవలసి రావడం వాస్తవం. ఇశ్రాయేలు కోసం దేవుని ప్రణాళికలకు ఇది చాలా ఆవశ్యకం, అంతర్భాగం. దేవుడు తనకు వ్యక్తిగతంగా ఇచ్చిన కలలను ద్వేషంతో ఉన్న తన కుటుంబానికి పునరావృతం చేయడంలో యోసేపు తన చిన్నతనపు అహంకారం తన గమ్యం వైపుకు స్వల్ప నాటకీయ విధానంలోనికి నెట్టివేసింది.
ఈ రోజు మనలో ప్రతి ఒక్కరూ మన జీవితంలో ఏదో ఒక సమయంలో తెలివిలేని నిర్ణయాలు తీసుకొని ఉంటాము. గతంలో మనం చేసిన మూర్ఖమైన లేదా తెలివిలేని ఎంపికల వల్ల మనం అగాధంలో ఉన్నట్లు భావించవచ్చు. మనం ఆ నిర్ణయాలతో కలిసి జీవించాల్సి వచ్చి ఉండవచ్చు లేదా ఆ నిర్ణయాల విషయంలో చింతపడుతూ ఉండి ఉంటాము. ఏవిధంగానైనా దేవుణ్ణి మన జీవితానికి కేంద్రంగా చేసుకోవాలని మనం నిర్ణయించుకున్నప్పుడు, ఆ చింతలనూ, ఎదురుదెబ్బలనూ ప్రక్కకు మళ్ళించి, ఆయన సన్నిధినీ, ఆయన శక్తినీ మనం అనుభవించేలా ఏర్పాటు చెయ్యడం మనం చూడడం ప్రారంభిస్తాము. దేవునితో ఏదీ వృధా కాదు, వైఫల్యాన్ని అనుభవించిన విషయాలు కూడా నిరూపయోగం కాదు. మన ముందున్న మార్గం ఒంటరిగానూ, సుదూరంగానూ ఉన్నట్టు కనిపించినప్పటికీ మన పట్ల దేవునికున్న ప్రణాళికలను ఆయన నేరవేరుస్తాడని విశ్వసించడం పొంగిపొరలే అనుభువంలో మనం జీవిస్తున్నామనడానికి అది సూచన.
About this Plan

పొంగిపొర్లుతున్న అనుభవంలో నుండి నడవాలనీ, పని చేయాలనీ, ప్రేమించాలనీ, సేవించాలనీ మీరు ఈ రోజు తీర్మానించుకొంటారా? ఇతరులు మిమ్మల్ని చూసినప్పుడు, బాగా నీరు కట్టిన తోటనూ లేదా ఏ కాలంలోనైనా ఎండిపోని పొంగిపొరలే ఒక ఊటను వారు చూచేలా మిమ్మల్ని నింపాలని పరిశుద్ధాత్మను అడుగుతారా?
More
Related Plans

Close Enough to Change: Experiencing the Transformative Power of Jesus

Living Above Labels

Prayer Initiative: Closer to Jesus

Who Is Jesus? 7 Days in the 'I Am' Statements

Small Yes, Big Miracles: What the Story of the World's Most Downloaded Bible App Teaches Us

"An INVITATION to FOLLOW : A 5-Day Journey Into Discipleship"

What Is the Fear of the Lord?

The Greatest of Joys

Discover God’s Will for Your Life
