కఠినమైన త్రోవలలో పొంగిపొరలే అనుభవం Sample

నూతన ప్రదేశంలో పొంగిపొరలి ప్రవహించడం
యోసేపును ఐగుప్తుకు తీసుకొనివచ్చారు, ఫోతీఫరుకు బానిసగా ఉండేలా అతనికి అమ్మివేసారు. మిగిలిన బానిసలందరి మధ్యలో ప్రత్యేకంగా నిలిచియుండేలా యోసేపులో ఒక ప్రత్యేకత ఉంది. తద్వారా యోసేపును ఆ ఇంటిలో గృహనిర్వాహకునిగా చేసారు. యోసేపులో ఉన్న ఆ ప్రత్యేకత తాను తన జీవితంలో కలిగియున్న దేవుని సన్నిధి మాత్రమే. ఒక గృహ సంబంధ బానిస లౌకికంగానూ, అనుదిన బాద్యతలలోనూ ఆ దేవుని సన్నిధి యోసేపును శక్తితో నింపింది. ఇది అద్భుతమైన కార్యం కాదా?
అనుకొనని విధంగా ఫోతీఫరు భార్య యోసేపును చూడడం ప్రారంభించినప్పుడు విషయాలు దుష్ట మలుపు తిరగడం ప్రారంభించాయి. చివరకు ఆమె యోసేపును వశపరచుకోడానికి ప్రయత్నించింది. ఫలితంగా యోసేపు వెనుతిరిగి ఇంటి నుండి పారిపోయాడు. నిరాకరించబడిన ఈ స్త్రీ ఒక కట్టుకథను అల్లి తన భర్తకు చెప్పింది, యోసేపు తనను వేధించాడని నిందమోపింది, అతనిని చెరసాలపాలు చేసింది.
ఒకవేళ యోసేపు దేవుని ఆత్మతో నిండి ఉండకపోయినట్లయితే, తన యజమాని భార్య మోసపూరిత ఉచ్చు నుండి తప్పించుకోవడానికీ, తాను బయటికి పారిపోడానికీ తగిన సమయస్ఫూర్తిని కలిగి యుండేవాడు కాదు.
జాయిస్ మేయర్ ఇలా చెప్పారు, “తరువాతి కాలంలో సంతోషంగా ఉండడంకోసం ఇప్పుడు సరియైన యెంపికలు చెయ్యడానికి ఇష్టత చూపించడమే జ్ఞానం.”‘ మనకు జ్ఞానం కొదువగా ఉన్నప్పుడు దేవుణ్ణి అడగాలని బైబిలు చెపుతుంది, ఆయన వెనుదీయక అనుగ్రహిస్తాడు. దేవునిమీద తమ హృదయాలను నిమగ్నం చేసుకొని, తమ జీవితాల కోసం ఆయన చిత్తాన్ని కనుగొనే వారికి దొరికే బహుమతి జ్ఞానం. మనం జీవిస్తున్న ప్రపంచంలోని సంక్లిష్టతలను నిర్వహించడానికీ, సరియైన దిశలో నడిపించబడడానికీ మనకు దేవుని జ్ఞానం అవసరం.
జీవితం మనలను నూతనమైనా, ఎదురుచూడని సమయాల ద్వారా తీసుకువెళ్తున్నప్పుడు, మార్గాన్ని కనుగొనడానికీ, జీవితాన్ని సంపూర్తిగా జీవించడానికీ దేవుని జ్ఞానమే మనకు సహాయం చేస్తుంది. ఎటువంటి నూతన బాధ్యతలలోనికైనా దేవుడు నిన్ను పిలిచినప్పుడు సమూహంలో నీవు నిలిచేలా ఆయన నిన్ను చెయ్యగలడు, ఎందుకంటే నీవు సమర్ధవంతంగా నిర్వహించడానికి ఆయన నీకు తగిన జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. పొంగిపొరలే అనుభవం నీలో ఉన్నదనడానికి ఇది ఒక రుజువుగా ఉంటుంది.
About this Plan

పొంగిపొర్లుతున్న అనుభవంలో నుండి నడవాలనీ, పని చేయాలనీ, ప్రేమించాలనీ, సేవించాలనీ మీరు ఈ రోజు తీర్మానించుకొంటారా? ఇతరులు మిమ్మల్ని చూసినప్పుడు, బాగా నీరు కట్టిన తోటనూ లేదా ఏ కాలంలోనైనా ఎండిపోని పొంగిపొరలే ఒక ఊటను వారు చూచేలా మిమ్మల్ని నింపాలని పరిశుద్ధాత్మను అడుగుతారా?
More
Related Plans

Mary Magdalene's Journey: 'Grace Restores' (Part 4)

OVERCOMING JEALOUSY THROUGH the HOLY SPIRIT

Faith Over Fear

21 Days of Selfess Living

When Anger Strikes

Devotions on F.I.R.E. Year Two

Yom Kippur - the Perfect Atonement: The Messiah's Sacrifice

Renewed in Every Season

The Grace to Stay: Holding on When Marriage Is Hard
