కఠినమైన త్రోవలలో పొంగిపొరలే అనుభవం Sample

చెరసాలలో పొంగిపొరలి ప్రవహిస్తుంది
చెరసాలలో ఉన్నప్పుడు యోసేపు చెరసాల అధికారి దృష్టిలో తిరిగి అభిమానాన్ని పొందాడు. ఆ కారణంగా చెరసాలలోని ఖైదీలందరి మీద బాధ్యత తీసుకొనేవాడయ్యాడు. పరాయి దేశంలో అధికారుల దృష్టిలో ఈ వ్యక్తి పదేపదే అనుకూలంగా ఉండి వారి అభినానానికి పాత్రుడు అవ్వడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అతని కుటుంబం కూడా చూడలేని భిన్నమైన లక్షణాన్ని వారు యోసేపులో గుర్తించారు. తరువాత రాజు భక్షకారుడు, పానదాయకుడు యోసేపు మాదిరిగానే చెరసాలలో ఉంచబడినప్పుడు వారి అవసరాల విషయంలో కూడా యోసేపు బాధ్యత వహించవలసి వచ్చింది.
ఈ మనుష్యుల అవసరాలను గురించి సహజంగా ముందే తెలుసుకోగలిగిన జ్ఞానం కలిగినవాడుగా ఉంది. వారిని కలవరపెట్టిన కలలను గురించి తనతో పంచుకోవాలని యోసేపు వారిని కోరడం ఆసక్తిని కలిగించే అంశం. యోసేపు చెప్పిన వివరణలు నిజమయ్యాయి, ఫలితంగా ఒక వ్యక్తికి మరణం విధించబడింది, మరొకరికి విముక్తి దొరికింది. తన కలను వివరించేటప్పుడు రాజు అతనిని తిరిగి నియమించినప్పుడు తనను జ్ఞాపకం చేసుకోవాలని విజ్ఞప్తి చేసాడు. అయితే అతడు యోసేపును గురించి మరచిపోయాడు.
రెండు సంవత్సరాల తరువాత, ఫరోకు రెండు కలలు వచ్చాయి, ఎవ్వరూ వాటిని వివరించలేకపోయారు. ఆ సమయంలో యోసేపును జ్ఞాపకం చేసుకొన్నారు, అతనిని రాజు ముందుకు పిలిపించారు.
ఈ సుదీర్ఘ నిరీక్షణను యోసేపు ఏవిధంగా కొనసాగించాడో అనే దానిని గురించిన ప్రస్తావన లేదు, అయితే అతడు చెరసాలలో ఉన్నప్పుడు చెరసాలలోని ఇతర ఖైదీలకు పరిచర్య చేస్తూనే ఉన్నాడు. ఖైదీలందరికీ స్వల్పమైన ఆహార పదార్ధాలను అందించడంలోనూ, చెరసాలలో నెమ్మది ఉండేలా చూడడంలోనూ, కలహాలను పరిష్కరించడంలోనూ, నిరాశలో ఉన్నవారిని ప్రోత్సహించడంలోనూ పాల్గొంటూ ఉండి ఉంటాడు.
మన ప్రస్తుత సమయం ఎంత కఠినమైనదిగా ఉన్నప్పటికీ మనం పొంగిపొరలే అనుభవంలో నివసిస్తున్నప్పుడు, మన చుట్టూ ఉన్నవారి అవసరాల విషయంలో మనం సున్నితంగా ఉంటాము. ఈ సమయంలో ఉన్న ఎదురుచూపును మనం ఓర్పుతో సహిస్తాము. ఈ ఎదురుచూపు ముగింపు కైరోస్ (దేవుడు నియమించిన) సమయంలో వస్తుందని విశ్వసిస్తూ, అప్పటివరకూ దేవుడు మనలను కోరినదేనినైనా నమ్మకంగా చేస్తూ ఓర్పుతో సహిస్తూ ఉండాలి. ఈ కఠినమైన కాలాలు అంతం లేనివిగా అనిపించవచ్చు, అయితే మనం అంతిమంగా పాల్గొనవలసిన భాద్యతలలో వృద్ధి చెందడంలో ఇవి ముఖ్య పాత్ర వహిస్తాయని మనకు తరువాత అర్థం అవుతుంది.
About this Plan

పొంగిపొర్లుతున్న అనుభవంలో నుండి నడవాలనీ, పని చేయాలనీ, ప్రేమించాలనీ, సేవించాలనీ మీరు ఈ రోజు తీర్మానించుకొంటారా? ఇతరులు మిమ్మల్ని చూసినప్పుడు, బాగా నీరు కట్టిన తోటనూ లేదా ఏ కాలంలోనైనా ఎండిపోని పొంగిపొరలే ఒక ఊటను వారు చూచేలా మిమ్మల్ని నింపాలని పరిశుద్ధాత్మను అడుగుతారా?
More
Related Plans

Rest in the Wrestle

Bible Stories to Deepen Your Friendships

Removing the Mask: Finding Freedom in Christ

More Than Conquerors: 10 Days in Romans 8

Music, Movies & God - Film + Faith

Romans

7 Days to Fall in Love With Jesus – Jean-Luc Trachsel

Gospel-Based Conversations to Have With Your Preteen

Kingdom Business: Masterclass Mini Sessions
