YouVersion Logo
Search Icon

కీర్తనలు 14

14
ప్రధానగాయకునికి. దావీదు కీర్తన.
1–దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు.వారు చెడిపోయినవారు అసహ్యకార్యములుచేయుదురు.
మేలుచేయు వాడొకడును లేడు.
2వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని
యెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను
3వారందరు దారి తొలగి బొత్తిగా చెడియున్నారు
మేలుచేయువారెవరును లేరు, ఒక్కడైనను లేడు
4యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మ్రింగు
నట్లు నా ప్రజలను మ్రింగుచు
పాపము చేయువారికందరికిని తెలివి లేదా?
పాపము చేయువారు బహుగా భయపడుదురు.
5ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము
పక్షముననున్నాడు
6బాధపడువారి ఆలోచనను మీరు తృణీకరించుదురు
అయినను యెహోవావారికి ఆశ్రయమై యున్నాడు.
7సీయోనులోనుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును
గాక.
యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించునప్పుడు
యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతో
షించును.

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for కీర్తనలు 14