YouVersion Logo
Search Icon

కీర్తనలు 15

15
దావీదు కీర్తన.
1యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన
వాడెవడు?
నీ పరిశుద్ధపర్వతముమీద నివసింపదగిన వాడెవడు?
2యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచు
హృదయపూర్వకముగా నిజము పలుకువాడే.
3అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలి
కానికి కీడుచేయడు
తన పొరుగువానిమీద నింద మోపడు
4అతని దృష్టికి నీచుడు అసహ్యుడు
అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని
సన్మానించును
అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను
మాట తప్పడు.
5తన ద్రవ్యము వడ్డికియ్యడు
నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు
ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చ
బడడు.

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for కీర్తనలు 15