YouVersion Logo
Search Icon

కీర్తనలు 13

13
ప్రధానగాయకునికి. దావీదు కీర్తన.
1యెహోవా, ఎన్నాళ్లవరకు నన్ను మరచిపోవుదువు?
నిత్యము మరచెదవా?
నాకెంతకాలము విముఖుడవై యుందువు?
2ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును?
ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖా
క్రాంతుడనై యుందును?
ఎంతవరకు నాశత్రువు నామీద తన్ను హెచ్చించు
కొనును?
3యెహోవా నా దేవా, నామీద దృష్టియుంచి నాకు
ఉత్తరమిమ్ము
4నేను మరణనిద్ర నొందకుండను–వాని గెలిచితినని
నా శత్రువు చెప్పుకొనకుండను
నేను తూలిపోయి యుండగా నా విరోధులు హర్షింప
కుండను
నా కన్నులకు వెలుగిమ్ము.
5నేనైతే నీ కృపయందు నమ్మిక యుంచియున్నాను
నీ రక్షణవిషయమై నా హృదయము హర్షించుచున్నది
యెహోవా నాకు మహోపకారములు చేసియున్నాడు
నేను ఆయనను కీర్తించెదను.

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for కీర్తనలు 13