30 రోజుల్లో కీర్తన గ్రంధంనమూనా

30 రోజుల్లో కీర్తన గ్రంధం

30 యొక్క 9

శక్తివంతమైన స్తుతులతో కీర్తించడం

మహోన్నతుడా, నేను నిన్నుగూర్చి సంతోషించిహర్షించుచున్నాను నీ నామమును కీర్తించెదను.(కీర్తన 9:2)

ఈ కీర్తనలో, దేవుని నామాన్ని స్తుతించడం ద్వారా కీర్తనకారుడు తన ఆనందాన్ని, ఎలా వ్యక్తపరుస్తాడో మనం చూస్తాము.బైబిల్ లో ఈయన ఒక్కరే కాదు చరిత్ర లో ఎంతోమంది విశ్వాసులు వారి భావాలను దేవుణ్ణి కీర్తించడం లో వ్యక్త పరుస్తారు" : (కీర్తన 33:3)లో ఆయననుగూర్చి నూతనకీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. "అని చూస్తాము మరియు తరువాత బైబిల్లో, విశ్వాసులు హృదయలలో దేవునికి కృతజ్ఞతతో కీర్తనలు, మరియు ఆత్మీయ పాటలతో కీర్తించుటకు " పిలువబడ్డారు.(ఉదా :కొలస్సయులకు :3:16)

కొన్ని మందిరాల్లో కీర్తించడం ఒక ముఖ్యమైన భాగం. మందిరం బయట కూడా, క్రైస్తవ సంగీతం చాల శక్తివంతమైనది గా ఉంటుంది మీరు ఇంతకుముందు ఈ అనుభవం పొందారా? మీ భావాలకు పదాలను తెలుసుకోవడంలో మరియు మీ కృతజ్ఞతను వ్యక్తపరచడంలో మంచి కీర్తన ఎలా సహాయపడుతుందో మీరు ఇప్పటికే అనుభవించారా, స్తుతుల లేక వేదన ?ఈనాటి కీర్తన దేవుని కీర్తించడానికి స్తుతుంచడానికి మిమ్మల్ని ఉత్సాహపరుచును గాక యెహోవాను స్తుతించుడి. "యెహోవాను స్తుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అది మనోహరము స్తోత్రముచేయుట ఒప్పిదము."(కీర్తన:147:1)

వాక్యము

ఈ ప్రణాళిక గురించి

30 రోజుల్లో కీర్తన గ్రంధం

"కీర్తనల గ్రంధం లో 150 పద్యాలు మరియు కీర్తనలు ఉన్నాయి.దేవునిపై నమ్మకం తో ఉండే ప్రజల బాధ, భయం, ఆనందం మరియు ఆశ ను వ్యక్త పరుస్తాయి ఈ 30 రోజుల ధ్యానం లో శతాబ్దాల నాటి ఈ పదాలు మీ స్వంత భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి, కొత్త ఆశను కనుగొనడానికి మరియు మీ విశ్వాసంలో బలపడటానికి ఎలా సహాయపడతాయో తెలుసుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. "

More

ఈ ప్రణాళికను అందించినందుకు GlobalRize కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: www.globalrize.org