30 రోజుల్లో కీర్తన గ్రంధంనమూనా

దేవుని అద్భుతమైన మాటలు యెహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టిమూసలో ఏడు మారులు కరగి ఊదిన వెండి యంత పవిత్రములు.(కీర్తన 12:6)
ఈ కీర్తనలో, దావీదు మనుషుల మాటలను దేవుని మాటలతో పోలుస్తాడు .తన చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి ఫిర్యాదు చేస్తూ ఈ కీర్తన యొక్క మొదటి భాగంలో, చెప్తాడు, వారు అబద్ధాలు ఆడతారు ,గొప్పలు చెప్పుకుంటారు, వారు మాట్లాడేటప్పుడు ఇచ్చకములాడు పెదవులు మరియు ద్విమనస్కులు అని. వారు చెడు మాటలు పలకడం ద్వారా ఇతరుల జీవితాలను కష్టతరం చేస్తారు దీన్ని బట్టి దుష్ట మనసు ఎలా ఉంటుందో తెలుస్తుంది అలాంటి వర్గాలలో జీవించడం నిరుత్సాహాన్నిస్తుంది, దేవుని మాటలు పూర్తి భిన్నంగా ఉంటాయి ఎంతో ఓదార్పునిస్థాయి అవి మంచివి నమ్మగలిగిన, స్వచ్ఛమైనవి , . కష్ట పరిస్థితులలో నమ్మకాన్నిచ్చి దేవుని వాగ్దానాలపై మనం ఆధారపడవచ్చని అర్ధాన్నిస్త్తాయి .బాధపడువారికి చేయబడిన బలాత్కారమును బట్టియు దరిద్రుల నిట్టూర్పులనుబట్టియు నేనిప్పుడే లేచెదను రక్షణను కోరుకొనువారికి నేను రక్షణ కలుగజేసెదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు (5వ వచనం).
బైబిల్లో ఇంకా ఎన్నో వాగ్దానాలు చేయ బడ్డాయి దేవుడు తనను నమ్ముకున్నవారికి నిత్యజీవము ,క్షమాపణ ఇస్తానని వాగ్దానం చేసాడు మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక ఆలాగు చేయును (1 థెస్సలొనీకయులు 5:24).
ఎలాంటి మాటలు మీరు మాట్లాడతారు ? అవి స్వచ్ఛమైనవి, మంచివి మరియు నమ్మదగినవిగా ఉన్నాయా? మీ మాటలు ఇతరులపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి?
వాక్యము
ఈ ప్రణాళిక గురించి

"కీర్తనల గ్రంధం లో 150 పద్యాలు మరియు కీర్తనలు ఉన్నాయి.దేవునిపై నమ్మకం తో ఉండే ప్రజల బాధ, భయం, ఆనందం మరియు ఆశ ను వ్యక్త పరుస్తాయి ఈ 30 రోజుల ధ్యానం లో శతాబ్దాల నాటి ఈ పదాలు మీ స్వంత భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి, కొత్త ఆశను కనుగొనడానికి మరియు మీ విశ్వాసంలో బలపడటానికి ఎలా సహాయపడతాయో తెలుసుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. "
More
ఈ ప్రణాళికను అందించినందుకు GlobalRize కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: www.globalrize.org
సంబంధిత ప్లాన్లు

అద్భుతాల 30 రోజులు

నన్ను ఆజ్ఞాపించు – జీరో కాన్ఫరెన్స్

గ్రేస్ గీతం

దేవుని కవచం - అపొస్తలుల చర్యలు

ఈస్టర్ అనేది క్రాస్ - 4 రోజుల వీడియో ప్రణాళిక

హింసలో భయాన్ని ఎదిరించుట
క్రిస్మస్ హృదయంలో ఉంది - 7 రోజుల వీడియో ప్లాన్

30 రోజుల్లో కీర్తన గ్రంధం
