30 రోజుల్లో కీర్తన గ్రంధంనమూనా

30 రోజుల్లో కీర్తన గ్రంధం

30 యొక్క 30

"న్యాయం కోసం కేకభక్తిహీనులను, పాపము చేయువారిని నీవు లాగివేయునట్టు నన్ను లాగి వేయకుము. వారు దుష్టాలోచన హృదయములో నుంచుకొని తమ పొరుగువారితో సమాధానముగా మాటలాడుదురు వారి క్రియలనుబట్టి వారి దుష్టక్రియలనుబట్టి వారికి ప్రతికారము చేయుము. వారు చేసిన పనినిబట్టి వారికి ప్రతికారము చేయుము వారికి తగిన ప్రతిఫలమిమ్ము.(కీర్తన:28:3-4)

దావీదు పరిస్థితి బాగా లేదు. అతనికి అత్యవసరంగా దేవుని సహాయం కావాలి.యెహోవా, నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము నీవు మౌనముగా నుండినయెడల నేను సమాధిలోనికి దిగువారివలె అగుదును." (కీర్తన :28:1)దావీదు బలం అంత మైపోయే .దేవుని సహాయం లేకుండా, అతను నాశనమవుతాడు.తమ స్నేహితులతో శాంతిగా మాట్లాడి అదే సమయంలో ఇతరులకు అన్యాయం చేసే “దుష్టుల”తో సంబంధం కలిగి ఉంటాయి.

దావీదు అలాంటి వారిని ఎదిరించలేడు. సొంతగా ప్రతీకారం తీర్చుకోవాలని కూడా అనుకోడు.వారి దుష్ట కార్యాలకు ప్రతిఫలం ఇవ్వమని అతను దేవుడిని కోరతాడు కొన్ని వచనాలు తర్వాత, అతను కృతజ్ఞతతో వెనక్కి తిరిగి పరిశీలించుకుంటాడు : యెహోవా నా విజ్ఞాపనధ్వని ఆలకించియున్నాడు ఆయనకు స్తోత్రము కలుగును గాక (కీర్తన:28:6)

అన్యాయమైన, దుర్మార్గపు వ్యక్తులతో దావీదు ఒక్కడే కాదు.వ్యవహరించేది బహుశా మీకు కూడా కొందరు తెలిసే ఉంటారు అలాంటి పరిస్థితులను మీరు ఎలా ఎదుర్కొంటారు?దావీదు ఉదాహరణని అనుసరిస్తూ దేవుని వేడుకుంటారా దుష్టులకు ప్రతిఫలం ఇవ్వమని? మీ ప్రార్థనలో ఈ కీర్తనలోని ముగింపు పదాలను కూడా మీరు పలకవచ్చు నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము (కీర్తన :28:9)

ఈ భక్తిగీతం ఈ వరుసలో చివరిది. 30 రోజులుగా, మేము వివిధ రకాల కీర్తనలను పరిశీలించాము. వాటిలో ఏది మీకు బాగా నచ్చింది? మరియు మీకు ఏది ఎక్కువ ప్రోత్సాహకరంగా అనిపించింది?

మరిన్ని ధ్యాన ప్రణాళికల కోసం, YouVersion లోని GlobalRize పేజీని సందర్శించండి.

దేవుడు, బైబిల్ మరియు క్రైస్తవ జీవితం గురించి వ్యాసాలను మా వెబ్‌సైట్ తెలుగుబైబిల్ స్కూల్ లో చ డవచ్చు.

వాక్యము

ఈ ప్రణాళిక గురించి

30 రోజుల్లో కీర్తన గ్రంధం

"కీర్తనల గ్రంధం లో 150 పద్యాలు మరియు కీర్తనలు ఉన్నాయి.దేవునిపై నమ్మకం తో ఉండే ప్రజల బాధ, భయం, ఆనందం మరియు ఆశ ను వ్యక్త పరుస్తాయి ఈ 30 రోజుల ధ్యానం లో శతాబ్దాల నాటి ఈ పదాలు మీ స్వంత భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి, కొత్త ఆశను కనుగొనడానికి మరియు మీ విశ్వాసంలో బలపడటానికి ఎలా సహాయపడతాయో తెలుసుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. "

More

ఈ ప్రణాళికను అందించినందుకు GlobalRize కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: www.globalrize.org