30 రోజుల్లో కీర్తన గ్రంధంనమూనా

30 రోజుల్లో కీర్తన గ్రంధం

30 యొక్క 13

"దేవునిచే విడువబడిన స్థితి యెహోవా, ఎన్నాళ్లవరకు నన్ను మరచిపోవుదువు? నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముఖుడవై యుందువు?(కీర్తన:13:1)

దావీదు తన అందమైన కీర్తనల లో విశ్వాసాన్ని, దేవుని వాగ్దానాలపై తన నమ్మకాన్ని మరియు ప్రభువుపై తన ఆనందాన్ని వ్యక్తపరిచేవి అనేకమైనవి మనం ఇప్పటికే చదివాము.కానీ ఈ రోజు అందుకు భిన్నంగా వింటాం దావీదు విడువబడినట్లుగా మరియు ఒంటరిగా ఉన్నట్లు భావిస్తాడు, దేవుడు తనను మరచిపోయినట్లు భావిస్తాడు! ఇది చాల పెద్ద సమస్యే , ఎందుకంటే దావీదు ప్రభువు లేకుండా జీవించలేడు.

మీరు కూడా కొన్ని సార్లు ఒంటరితనం అనుభవించి ఉంటారు మీరు ఇంతకు ముందు అనుభవించినంతగా దేవుని సహాయం, మార్గదర్శకత్వం మరియు అయన సమీపంగా ఉన్నాడని తెలుసుకోకపోవొచ్చు అనుభవించకపోయిఉండొచ్చు అది మిమ్మల్ని గలిబిలికి మరియు నిరాశకు గురి చేస్తుంది. ఇది మీకు వర్తిస్తే, చదవడం కొనసాగించండి ! దావీదు తన కీర్తనను ఇక్కడ ముగించలేదు.

తన పాపాల్ని ఒప్పుకొని దావీదు దేవునికి మొరపెడ్తున్నాడు దేవుని సహాయమ కోరుతున్నాడు :
“నేనైతే నీ కృపయందు నమ్మిక యుంచి యున్నాను నీ రక్షణవిషయమై నా హృదయము హర్షించుచున్నది(కీర్తన 13:5) మనం ఒంటరిగా మరియు విడువబడిన స్థితి అని భావించినప్పుడల్లా ఈ రెండు విషయాలు చాలా ముఖ్యమైనవి: దేవుని స్థిరమైన ప్రేమను మనస్సులో ఉంచుకోవడం మరియు ఆయన ముందు మీ హృదయాన్ని కుమ్మరించడం. మీరు దావీదు భావాలను గుర్తించారా? మీరైతే ఎలా స్పందిస్తారు?"

వాక్యము

ఈ ప్రణాళిక గురించి

30 రోజుల్లో కీర్తన గ్రంధం

"కీర్తనల గ్రంధం లో 150 పద్యాలు మరియు కీర్తనలు ఉన్నాయి.దేవునిపై నమ్మకం తో ఉండే ప్రజల బాధ, భయం, ఆనందం మరియు ఆశ ను వ్యక్త పరుస్తాయి ఈ 30 రోజుల ధ్యానం లో శతాబ్దాల నాటి ఈ పదాలు మీ స్వంత భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి, కొత్త ఆశను కనుగొనడానికి మరియు మీ విశ్వాసంలో బలపడటానికి ఎలా సహాయపడతాయో తెలుసుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. "

More

ఈ ప్రణాళికను అందించినందుకు GlobalRize కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: www.globalrize.org