30 రోజుల్లో కీర్తన గ్రంధంనమూనా

30 రోజుల్లో కీర్తన గ్రంధం

30 యొక్క 11

దేవుడు చూచువాడు మరియు యెరిగినవాడు

యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు యెహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులార చూచుచున్నాడు తన కనుదృష్టిచేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు (కీర్తన :11:4)

దేవుడు ఒక ఆత్మస్వరూపి ప్రత్యేకించి ఒక స్థలములోఉండదు కొన్నిసార్లు బైబిల్ దేవుడు అలంకరించిన రాజుగా సింహాసనాసీనుడై ఉన్నాడు అని చెబుతుంది మరియు ఆయన రాజ్యాన్ని "పరలోకం " అని అంటారు . పరలోకం అనేది దేవుడు నివసించే ఆధ్యాత్మిక స్థలం ఇది మన ప్రపంచానికి చాలా దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది.కానీ మనకు దేవుడు దూరస్థుడు కాడు ఆయన భూమిపై ఏమి జరుగుతుందో ప్రతిదీ చూస్తాడు మరియు ఆయన జోక్యం కలిగి ఉంటాడు మరో విధంగా అపనమ్మకమైన పరిస్థితిలో ఇది కీర్తనకారుడికి ఆశను ఇస్తుంది: "దుష్టులు విల్లెక్కు పెట్టియున్నారు చీకటిలో యథార్థహృదయులమీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించి యున్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు?" (కీర్తన 11:2-3)

ఆశకు ఒకేఒక్క కారణం దేవుడు చూచే వాడు మరియు తెలుసుకునేవాడై ఉన్నాడు ఆయన “పరలోకంలో” సింహాసనాసీనుడై ఉన్నప్పటికీ, నీతిమంతులను బాధపెట్టే దుష్టులకు ఆయన తీర్పు తీరుస్తాడు: "దుష్టులమీద ఆయన ఉరులు కురిపించును అగ్నిగంధకములును వడగాలియువారికి పానీయభాగమగును" (కీర్తన 11:6 ).

నీతిమంతుల కొరకు దేవుడు జోక్యం చేసుకుంటాడని మీకు తెలుసా? మీరు ఏమైనా ఉదాహరణలు చెప్పగలరా?

వాక్యము

ఈ ప్రణాళిక గురించి

30 రోజుల్లో కీర్తన గ్రంధం

"కీర్తనల గ్రంధం లో 150 పద్యాలు మరియు కీర్తనలు ఉన్నాయి.దేవునిపై నమ్మకం తో ఉండే ప్రజల బాధ, భయం, ఆనందం మరియు ఆశ ను వ్యక్త పరుస్తాయి ఈ 30 రోజుల ధ్యానం లో శతాబ్దాల నాటి ఈ పదాలు మీ స్వంత భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి, కొత్త ఆశను కనుగొనడానికి మరియు మీ విశ్వాసంలో బలపడటానికి ఎలా సహాయపడతాయో తెలుసుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. "

More

ఈ ప్రణాళికను అందించినందుకు GlobalRize కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: www.globalrize.org