30 రోజుల్లో కీర్తన గ్రంధంనమూనా

నిత్య ఆనందానికి ఒక మార్గం
"దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక
యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించు వాడూ ధన్యుడు." (కీర్తన 1:1-2 )
కీర్తనల గ్రంధం పాత నిబంధనలోని కీర్తనలు మరియు పద్యాల సంకలనం. అవి విశ్వాసుల జీవిత అనుభవాలను, ముఖ్యంగా దేవునితో వారికున్న సంబంధాన్ని గురించి మనకు ఒక తెలియచేస్తాయి. ఈ పాఠాలు వేల సంవత్సరాల తర్వాత కూడా విలువైనవి.
మొదటి కీర్తన, ఈ కీర్తన మనకు గ్రంధాన్ని పరిచయం చేస్తుంది . ఇది మనకు శాశ్వత ఆనందానికి మార్గాన్ని చూపిస్తుంది : మీరు జీవితంలో ఎలాంటి అనుభవాలను కలిగి ఉన్నా, మీ పరిస్థితి ఏదైనా, మీరు దేవునితో సన్నిహితంగా జీవిస్తూ ఆయన వాక్యంలో ఆనందిస్తే, మీరు ఆశీర్వదించబడతారు . నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అతడు చేయునదంతయు సఫలమగును అని కీర్తన చెబుతుంది. దేవుని వాక్యం, ఆయన “ధర్మశాస్త్రం” అయన బోధన, మనల్ని పోషించి, ఫలించేలా చేస్తుంది.
దేవుడు లేకుండా జీవించే వారితో ఆయన వాక్యాన్ని తృణీకరించే దుష్టులతో ఈ జీవన విధానం విభేదిస్తుంది. వారు అస్సలు వర్ధిల్లరు. వారి జీవన విధానం వారిని చెడు మార్గంలోకి నాశనమునకు నడిపిస్తుంది .
ఫలవంతమైన మరియు సంతృప్తికరమైన జీవితానికి “రాత్రింబగళ్లు” దేవుని వాక్యాన్ని ధ్యానించడం చాలా ముఖ్యం. మీరు ప్రభువైన దేవుని బోధనలను నేర్చుకొని అయన ఆశీర్వాదాన్ని పొందుకున్నారా
వాక్యము
ఈ ప్రణాళిక గురించి

"కీర్తనల గ్రంధం లో 150 పద్యాలు మరియు కీర్తనలు ఉన్నాయి.దేవునిపై నమ్మకం తో ఉండే ప్రజల బాధ, భయం, ఆనందం మరియు ఆశ ను వ్యక్త పరుస్తాయి ఈ 30 రోజుల ధ్యానం లో శతాబ్దాల నాటి ఈ పదాలు మీ స్వంత భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి, కొత్త ఆశను కనుగొనడానికి మరియు మీ విశ్వాసంలో బలపడటానికి ఎలా సహాయపడతాయో తెలుసుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. "
More
ఈ ప్రణాళికను అందించినందుకు GlobalRize కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: www.globalrize.org
సంబంధిత ప్లాన్లు

నన్ను ఆజ్ఞాపించు – జీరో కాన్ఫరెన్స్
క్రిస్మస్ హృదయంలో ఉంది - 7 రోజుల వీడియో ప్లాన్

గ్రేస్ గీతం

ఈస్టర్ అనేది క్రాస్ - 8 రోజుల వీడియో ప్రణాళిక
క్రిస్మస్ హృదయంలో ఉంది - 14 రోజుల వీడియో ప్లాన్

దేవుని కవచం - అపొస్తలుల చర్యలు

అద్భుతాల 30 రోజులు

ఈస్టర్ అనేది క్రాస్ - 4 రోజుల వీడియో ప్రణాళిక

హింసలో భయాన్ని ఎదిరించుట
