30 రోజుల్లో కీర్తన గ్రంధంనమూనా

30 రోజుల్లో కీర్తన గ్రంధం

30 యొక్క 8

స్తుతి కీర్తన యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, భూమియందంతట నీ నామము ఎంత ప్రభావముగలది. (కీర్తన 8:1)

ఈనాటి కీర్తన దేవుని మహిమ ప్రభావములు గురించి మరియు స్తుతులతో నిండి ఉంటుంది .భూమ్యాకాశములలో నా దేవుడు గొప్పవాడు దావీదు ఆకాశామును , చంద్రుడిని మరియు నక్షత్రాలను చూసాడు . దేవుడు వాటిని వాటి స్థానంలో పెట్టాడు , ఇది అంత ఆయన గొప్ప సృష్టికి నిదర్శనం.మరియు ఆయన చేసిన ప్రతిదానికీ బాధ్యత వహించేలా "మనల్ని నియమించాడు దేవునికంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసియున్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి యున్నావు." (కీర్తన 8:5)

దావీదు ప్రభువును చూస్తాడు .అతను దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు .మానవులమైన మనకు ఆయన ఇచ్చిన ప్రత్యేక స్థానాన్ని చూసి ఆశ్చర్యపోయి అతను మరోసారి ఇలా స్తుతిస్తూన్నాడు యెహోవా మా ప్రభువా భూమియందంతట నీ నామము ఎంత ప్రభావముగలది(కీర్తన8:9)

సృష్టిలో కనిపించే దేవుని గొప్పతనం గురించి, మానవులమైన మన పట్ల ఆయనకున్న ప్రత్యేక శ్రద్ధ గురించి మీరు ఆలోచించినప్పుడు, దావీదు తో పాటు కలిసి మీరు కీర్తిస్తారా ? మీ హృదయం ప్రభువైన దేవుని పట్ల సంతోషం భక్తితో నిండి ఉంటుందా ?

వాక్యము

ఈ ప్రణాళిక గురించి

30 రోజుల్లో కీర్తన గ్రంధం

"కీర్తనల గ్రంధం లో 150 పద్యాలు మరియు కీర్తనలు ఉన్నాయి.దేవునిపై నమ్మకం తో ఉండే ప్రజల బాధ, భయం, ఆనందం మరియు ఆశ ను వ్యక్త పరుస్తాయి ఈ 30 రోజుల ధ్యానం లో శతాబ్దాల నాటి ఈ పదాలు మీ స్వంత భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి, కొత్త ఆశను కనుగొనడానికి మరియు మీ విశ్వాసంలో బలపడటానికి ఎలా సహాయపడతాయో తెలుసుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. "

More

ఈ ప్రణాళికను అందించినందుకు GlobalRize కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: www.globalrize.org