30 రోజుల్లో కీర్తన గ్రంధంనమూనా

30 రోజుల్లో కీర్తన గ్రంధం

30 యొక్క 7

అన్యాయం మరియు చెడును ఎదుర్కొంటూ ప్రార్ధించడం

హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా,దుష్టుల చెడుతనము మాన్పుము నీతిగలవారిని స్థిరపరచుము యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడై యున్నాడు.కీర్తన 7:9

జీవితం తరచు అన్యాయంగా ఉంటుంది. చుట్టూ ఉన్నవి చూసినప్పుడు నిరాశ మరియు నిరుత్సాహనికి లోనవుతాం (లేదా మన సొంత జీవితాల్లో కూడా అనుభవిస్తాం) ఎలా అంటే దుష్టుల ఆలోచన” చాలా మంచి పనులను దెబ్బతీస్తుంది మరియు కలవరపెడుతుంది . మనము నీతిని ప్రేమను వెంబడించాలనుకుంటాము కానీ కొన్నిసార్లు పాపం ప్రభావం అధికంగా ఉండటం వల్ల ఈ ప్రయత్నం నిరాశ కలిగిస్తుంది.

ఈ కీర్తనలో, దావీదు తనకు అన్యాయం జరిగినప్పుడు తన నిరాశను వ్యక్తపరుస్తాడు. అతను దీనిని ఒక ప్రత్యేకమైన విషయంగా చూడట్లేదు కానీ ఈ పాపంతో ప్రపంచాన్ని నింపుతున్న దుష్టత్వానికి ఉదాహరణగా దేవుడు దీనిని పరిష్కరించాలి.అని అతనికి తెలుసు, దేవుడు చివరికి ఈ భూమిపై సరైన మరియు న్యాయమైన కార్యాలని పునరుద్ధరిస్తాడని ఇప్పుడే ఇది చేయమని ప్రభువుకు మొరపెడుతున్నాడు.
ఈ లోకంలో దుష్టత్వం మనల్ని ముంచెత్తినప్పుడు మనం చేయగలిగే అత్యుత్తమమైన పని ఇదే, .ఆయనకు మోర పెట్టడం

దేవుని ఎదుట నీ హృదయాన్ని కుమ్మరించు , అయినను మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త
ఆకాశములకొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటియందు నీతి నివసించును
(2 పేతురు 3:13).ఈ కొత్త లోకం మీరు కోరుకుంటున్నారా? ఈ లోకం ఎలా ఉంటుందని మీరు ఊహించుకుంటున్నారు?

వాక్యము

ఈ ప్రణాళిక గురించి

30 రోజుల్లో కీర్తన గ్రంధం

"కీర్తనల గ్రంధం లో 150 పద్యాలు మరియు కీర్తనలు ఉన్నాయి.దేవునిపై నమ్మకం తో ఉండే ప్రజల బాధ, భయం, ఆనందం మరియు ఆశ ను వ్యక్త పరుస్తాయి ఈ 30 రోజుల ధ్యానం లో శతాబ్దాల నాటి ఈ పదాలు మీ స్వంత భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి, కొత్త ఆశను కనుగొనడానికి మరియు మీ విశ్వాసంలో బలపడటానికి ఎలా సహాయపడతాయో తెలుసుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. "

More

ఈ ప్రణాళికను అందించినందుకు GlobalRize కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: www.globalrize.org