30 రోజుల్లో కీర్తన గ్రంధంనమూనా

30 రోజుల్లో కీర్తన గ్రంధం

30 యొక్క 6

క్షమాపణ కోరుకో

యెహోవా, నీ కోపముచేత నన్ను గద్దింపకుము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము.యెహోవా, నేను కృశించి యున్నాను, నన్ను కరుణించుము యెహోవా, నా యెముకలు అదరుచున్నవి, నన్ను బాగుచేయుము (కీర్తన 6 :1-2)

ఈ కీర్తన దావీదు ప్రాణాపాయ స్థితిలో వ్రాయబడింది మనము 1వచనం లో చూసినట్టు ఇది దేవుని కోపం వల్ల ఏర్పడింది. ఈ కీర్తన రచయిత తాను చేసిన ఒక ఘోర పాపానికి మరియు ప్రస్తుత క్లిష్ట పరిస్థితికి మధ్య సంబంధాన్ని చూస్తాడు. ఈ పాపము వల్ల దావీదు దేవునితో ఉన్న సాన్నిహిత్యాన్ని కోల్పాయాడు.

దేవునితో సంభందాన్ని సరిచేసుకోవడం దావీదుకు ఎంతో ముఖ్యం లేకపోతే అయన జీవించలేడు అటువంటి పరిస్థితిలో ఒకేఒక్క మార్గం దేవుని కృప కొరకు మొరపెట్టడం నీ కృపనుబట్టి నన్ను రక్షించుము” (కీర్తన 6:4)దేవునికి పాపుల పట్ల ఉన్న ఎనలేని ప్రేమ మాత్రమే ఆశ మరియు స్వస్థతకు ఒకేఒక్క ఆధారం.మరియు ప్రభువు అలాంటి కృప కోసం చేసే విజ్ఞాపనలను వినడానికి సిద్ధంగా ఉన్నాడు.
9 వచనం మనకు ఇలా చెబుతుంది: “యెహోవా నా విన్నపము ఆలకించి యున్నాడు యెహోవా నా ప్రార్థన నంగీకరించును."

మరి మీకు ఇలాంటి అనుభవం ఉందా ?మీరు ఎప్పుడైనా పాపం లో పడిపోయినప్పుడు మళ్ళి దేవుని క్షమాపణ ,కృప కొరకు మొరపెడ్తారా దేవునితో మీ సంబంధాన్ని సరిచేసుకోవడానికి మరియు ఆయన ఆశీర్వాదాన్ని మళ్ళీ పొందుకోవడానికి అదే ఏకైక మార్గం!

వాక్యము

ఈ ప్రణాళిక గురించి

30 రోజుల్లో కీర్తన గ్రంధం

"కీర్తనల గ్రంధం లో 150 పద్యాలు మరియు కీర్తనలు ఉన్నాయి.దేవునిపై నమ్మకం తో ఉండే ప్రజల బాధ, భయం, ఆనందం మరియు ఆశ ను వ్యక్త పరుస్తాయి ఈ 30 రోజుల ధ్యానం లో శతాబ్దాల నాటి ఈ పదాలు మీ స్వంత భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి, కొత్త ఆశను కనుగొనడానికి మరియు మీ విశ్వాసంలో బలపడటానికి ఎలా సహాయపడతాయో తెలుసుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. "

More

ఈ ప్రణాళికను అందించినందుకు GlobalRize కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: www.globalrize.org