30 రోజుల్లో కీర్తన గ్రంధంనమూనా

30 రోజుల్లో కీర్తన గ్రంధం

30 యొక్క 4

లోతైన మరియు శాశ్వతమైన ఆనందం

"వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిననాటి సంతోషముకంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి ." (కీర్తన 4:7 )

దేవుని స్వయంగా తెలుసుకున్నప్పుడే గొప్ప సంతోషం కలుగుతుంది . ఈ కీర్తనలో, దావీదు తన ఆనందాన్ని తన చుట్టూ ఉన్న ప్రజలు అనుభవించే ఆనందానికి భిన్నంగా చూపిస్తున్నాడు. ఆ ఇతర వ్యక్తులకు ఎక్కువ లోక సంపద ఉంది, కానీ దేవుడు హృదయంలో ఇచ్చే సంతోషం తో పోలిస్తే వారి సంతోషం ఏ పాటిది .

లోక సంపద చెడ్డది ముఖ్యమైనది కాదు అని బైబిల్ చెప్పడం లేదు. ఇది తృప్తికరమైన జీవితానికి అవసరం కాదు, శాశ్వత సంతోషానికి హామీ కూడా కాదు. మీ సంబంధం దేవునితో చాలా ముఖ్యమైనది! ఉదాహరణకు (సామెతలు 15:16) చూడండి: “నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుటకంటె యెహోవాయందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి యుండుట మేలు

భూసంబంధమైన వస్తువుల కంటే దేవునితో జీవితం ఎక్కువ ఆనందాన్ని ఇవ్వడానికి ఒక కారణం ఏమిటంటే అది ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. మనం చనిపోయినప్పుడు, మన ఆస్తులను మనతో తీసుకెళ్లలేము. కానీ దేవునితో స్థిరమైన మరియు శాశ్వతమైన జీవితం ఉంటుంది . దేవునితో మన సంబంధంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, మన ఆనందానికి మూలం స్థిరంగా మరియు అంతులేనిదిగా ఉంటుంది .

మీరు మీ హృదయంలో దేవుని ఆనందాన్ని అనుభవిస్తున్నారా? మీ ఆనందానికి గల కారణం ఏమిటి?

వాక్యము

ఈ ప్రణాళిక గురించి

30 రోజుల్లో కీర్తన గ్రంధం

"కీర్తనల గ్రంధం లో 150 పద్యాలు మరియు కీర్తనలు ఉన్నాయి.దేవునిపై నమ్మకం తో ఉండే ప్రజల బాధ, భయం, ఆనందం మరియు ఆశ ను వ్యక్త పరుస్తాయి ఈ 30 రోజుల ధ్యానం లో శతాబ్దాల నాటి ఈ పదాలు మీ స్వంత భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి, కొత్త ఆశను కనుగొనడానికి మరియు మీ విశ్వాసంలో బలపడటానికి ఎలా సహాయపడతాయో తెలుసుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. "

More

ఈ ప్రణాళికను అందించినందుకు GlobalRize కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: www.globalrize.org