30 రోజుల్లో కీర్తన గ్రంధంనమూనా

కష్ట పరిస్థితిలో ప్రార్ధించడం
"యెహోవా లెమ్ము ! నా దేవా, నన్ను రక్షించుము!" (కీర్తన 3:8 )
దావీదు ఈ కీర్తనను చాలా కష్ట పరిస్థితిలో రాశాడు. అతని సొంత కుమారుడు తన సింహాసనాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించాడు. అది దావీదుకు అవమానకరం మరియు ప్రమాదకరమైనది. అతను నగరం నుండి పారిపోవాల్సి వచ్చింది మరియు అతడు నిరాశతో పాటు ప్రజల ఎగతాళిని భరించాల్సి వచ్చింది.
దావీదు జీవితం ప్రమాదంలో పడటం ఇది మొదటిసారి కాదు. దేవుడు తన శత్రువుల నుండి తనను ఎలా రక్షించాడో అతడు చాలాసార్లు అనుభవించాడు. ఇప్పుడు అతను ఉద్దేశపూర్వకంగా ఆ పరిస్థితులలో దేవుడు తనకు ఎలా సమాధానం ఇచ్చాడో జ్ఞాపకం చేసుకున్నాడు . మరియు అతను కొత్తగా దేవునికి ఇలా ప్రార్థిస్తాడు : "ఓ నా దేవా, నన్ను రక్షించు!"
దేవుడు సహాయం చేయగలడని చేయడానికి సిద్ధంగా ఉన్నాడని దావీదుకు తెలుసు. కాబట్టి, అతను తన పూర్తి నమ్మకాన్ని ప్రభువుపై నిలుపుతాడు .
మరి మీరు కష్టాలను ఎదుర్కొన్నప్పుడు మీరు ఎలా స్పందిస్తారు? మీరు నిరాశకు గురైనప్పుడు, మీరు సహాయం కోసం ప్రభువుకు మొరపెడతారా? , ఎందుకంటే (కీర్తన :50:15) లో దేవుడు వాగ్దానం చేశాడు: “ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమ పరిచెదవు ." ఇది నిజమని నీవు నువ్వు నమ్ముతున్నావా?
వాక్యము
ఈ ప్రణాళిక గురించి

"కీర్తనల గ్రంధం లో 150 పద్యాలు మరియు కీర్తనలు ఉన్నాయి.దేవునిపై నమ్మకం తో ఉండే ప్రజల బాధ, భయం, ఆనందం మరియు ఆశ ను వ్యక్త పరుస్తాయి ఈ 30 రోజుల ధ్యానం లో శతాబ్దాల నాటి ఈ పదాలు మీ స్వంత భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి, కొత్త ఆశను కనుగొనడానికి మరియు మీ విశ్వాసంలో బలపడటానికి ఎలా సహాయపడతాయో తెలుసుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. "
More
ఈ ప్రణాళికను అందించినందుకు GlobalRize కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: www.globalrize.org
సంబంధిత ప్లాన్లు

అద్భుతాల 30 రోజులు

నన్ను ఆజ్ఞాపించు – జీరో కాన్ఫరెన్స్

గ్రేస్ గీతం

దేవుని కవచం - అపొస్తలుల చర్యలు

ఈస్టర్ అనేది క్రాస్ - 4 రోజుల వీడియో ప్రణాళిక

హింసలో భయాన్ని ఎదిరించుట
క్రిస్మస్ హృదయంలో ఉంది - 7 రోజుల వీడియో ప్లాన్

30 రోజుల్లో కీర్తన గ్రంధం
