30 రోజుల్లో కీర్తన గ్రంధంనమూనా

30 రోజుల్లో కీర్తన గ్రంధం

30 యొక్క 2

ఆనందం భయం ?

"భయభక్తులు కలిగి యెహోవాను సేవించి గడగడ వణుకుచు సంతోషించుడి ." (కీర్తన 2:11 )

కీర్తన: 2 “భయం” మరియు “భీతి ” గురించి మాట్లాడుతుంది, మరియు “ఆనందం ” గురించి కూడా మాట్లాడుతుంది. ఈ పదాలు ఒకదానికొకటి మినహాయించినట్లు అనిపిస్తుంది. కానీ ఈ కీర్తనలో అవి అనుసంధానించబడి ఉన్నాయి. ఇది ఎలాగో చూద్దాం ?

ప్రభువు శక్తివంతమైన, పవిత్రమైన మరియు మహిమకరమైన దేవుడు. మనం దాని గురించి ఒక్క క్షణం ఆలోచించి, మనం పోల్చి చూస్తే ఎంత చిన్నవాళ్ళమో మరియు ఎంత పాపులమో గ్రహించినప్పుడు, ఇది మనల్ని చలింప చేస్తుంది . దేవునికి మనల్ని గద్దించే శక్తి మరియు హక్కు ఉన్నాయి, అంటే అది మన మరణాన్ని సూచిస్తుంది.

కాబట్టి, ఈ “సంతోషం” ఎక్కడి నుండి వస్తుంది? ఇది సాధ్యమే ఎందుకంటే దేవుడు పవిత్రుడు మరియు న్యాయవంతుడు మాత్రమే కాదు, “కనికరము, దయగలవాడు, దీర్ఘశాంతము విస్తారమైన కృప సత్యములు గల దేవుడైన యెహోవా (నిర్గమకాండము 34:6 )

ఆయన ప్రజల నాశనాన్ని కోరుకోడు; యేసుపై చూపించే విశ్వాసం ద్వారా పాపులైన మానవులకు నూతన జీవితాన్ని అందిస్తాడు. ఆయన మన జీవితాలను నిలబెట్టుకోవాలని మరియు చెడు నుండి మనలను రక్షించాలని కోరుకుంటున్నాడు. ఇది మనల్ని భయం, భక్తితో మరియు సంతోషంతో నింపుతుంది, “దేవుడు మనపక్షముననుండగా మనకు విరోధి ఎవడు (రోమా 8:31 ).

మీరు ప్రభువైన దేవుడిని గురించి ఆలోచించినప్పుడు మీకు ఎలాంటి భావోద్వేగాలు కలుగుతాయి? మీకు భయం, భక్తి, సంతోషం అనిపిస్తుందా ..?

వాక్యము

ఈ ప్రణాళిక గురించి

30 రోజుల్లో కీర్తన గ్రంధం

"కీర్తనల గ్రంధం లో 150 పద్యాలు మరియు కీర్తనలు ఉన్నాయి.దేవునిపై నమ్మకం తో ఉండే ప్రజల బాధ, భయం, ఆనందం మరియు ఆశ ను వ్యక్త పరుస్తాయి ఈ 30 రోజుల ధ్యానం లో శతాబ్దాల నాటి ఈ పదాలు మీ స్వంత భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి, కొత్త ఆశను కనుగొనడానికి మరియు మీ విశ్వాసంలో బలపడటానికి ఎలా సహాయపడతాయో తెలుసుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. "

More

ఈ ప్రణాళికను అందించినందుకు GlobalRize కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: www.globalrize.org