30 రోజుల్లో కీర్తన గ్రంధంనమూనా

30 రోజుల్లో కీర్తన గ్రంధం

30 యొక్క 15

దేవుని మందిరంలోకి ఎవరు ప్రవేశించగలరు ?


యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు? నీ పరిశుద్ధ పర్వతముమీద నివసింపదగిన వాడెవడు?యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే.(కీర్తన:1-2)

దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి, నిందారహితులు మరియు నీతిమంతులు మాత్రమే ఆయనకు సన్నిహితంగా జీవించగలరు. “సరైనది చేయడం” అంటే ఏమిటో మనం ఈ కీర్తనలో చదువుతాము:
సత్యము మాట్లాడటం, ఇతరుల గౌరవమును కాపాడటం మరియు సొంత లాభం ఆశించకుండా నీతిని అనుసరించడం దేవునికి భయపడటం వల్ల మనం ఇతర మానవులతో ఎలా ప్రవర్తిస్తామనే దానిపై మార్పు కనిపిస్తుంది. ఇది కేవలం ప్రార్థించడం ఆజ్ఞలను అనుసరించడం మాత్రమే కాదు కానీ ఈ ప్రపంచంలో దేవుని కృపను మరియు పరిశుద్ధతను తెలియచెప్పడం కూడా.ఇక్కడ వివరించబడిన నీతిమంతులు దేవుని మందిరంలోకి ప్రవేశించగలరు .కానీ చాలా తరచుగా, మనం వీటన్నిటిని అనుసరించడంలో "విఫలమవుతాము.

అంటే మనం దేవుని సన్నిధి నుండి దూరమయ్యామని అర్థమా?అవును మన ద్వారానే, . కానీ తండ్రి వద్దకు మనకోరకు ఒక మార్గాన్ని తెరిచినవాడున్నాడు .ఆయన తానే "మార్గమును , సత్యమును జీవమును " అని అంటాడు ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను. (2 కోరింథీ:5:21)అయన ద్వారా మనము తండ్రి ఇంటిలోనికి ప్రవేశించుటకు అర్హులమయ్యాము.

మీరు దేవునికి దగ్గరగా జీవిస్తున్నారా? లేకపోతే, ఏది మిమ్మల్ని దేవున్నుండి వెనుకకు లాగేది ?

వాక్యము

ఈ ప్రణాళిక గురించి

30 రోజుల్లో కీర్తన గ్రంధం

"కీర్తనల గ్రంధం లో 150 పద్యాలు మరియు కీర్తనలు ఉన్నాయి.దేవునిపై నమ్మకం తో ఉండే ప్రజల బాధ, భయం, ఆనందం మరియు ఆశ ను వ్యక్త పరుస్తాయి ఈ 30 రోజుల ధ్యానం లో శతాబ్దాల నాటి ఈ పదాలు మీ స్వంత భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి, కొత్త ఆశను కనుగొనడానికి మరియు మీ విశ్వాసంలో బలపడటానికి ఎలా సహాయపడతాయో తెలుసుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. "

More

ఈ ప్రణాళికను అందించినందుకు GlobalRize కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: www.globalrize.org