30 రోజుల్లో కీర్తన గ్రంధంనమూనా

30 రోజుల్లో కీర్తన గ్రంధం

30 యొక్క 16

దేవునితో జీవించుట

జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదు నీ కుడిచేతిలో నిత్యము సుఖములుకలవు.(కీర్తన:16:11)

బైబిలు మన నడకతో జీవితాన్ని పోలుస్తుంది. ప్రజలు జీవితంలో ఒక నిర్దిష్ట మార్గాన్ని ఎంచుకుంటారు, దానిని అనుసరిస్తారు. చేరుకోవడానికి ప్రయత్నించే వారికి లక్ష్యం ఉంటుంది.దావీదు జీవ మార్గంలో నడవాలని ఎన్నుకున్నాడు ఈ "జీవితం" దేవునికి దగ్గర సంబంధం కలిగి ఉంటుందని అతనికి తెలుసు కాబట్టి, అతను దేవుడినే సలహా అడుగుతాడు..అది చాలా తెలివైన పని - మీరు కూడా అలాగే చేయాలి.మీకు ఏ మార్గం సరైనదో దేవునికి తెలుసు.ఆయన జీవితాన్ని మీకంటే చాలా బాగా పరిశీలించేవాడు చాలా తెలివైన మరియు నమ్మదగిన మార్గంచూపేవాడు దేవునికి దగ్గరగా జీవిస్తే మనకు “పూర్ణ సంతోషం ,ఇస్తుంది ఎలా అంటే దావీదు అనుభవించినట్లు.దేవుడిని సేవించడం అంటే వేల కట్టుబాట్లతో కూడిన నిరుత్సాహనిచ్చే జీవితం కాదు, దీనికి విరుద్ధంగా .

ఇది ఆనందంతో నిండిన జీవితం!ఇది నిత్యజీవానికి నడిపే మార్గం యోహాను 17:3 లో మనం చదివినట్లుగా, దేవునితో జీవితం అంటే సంపూర్ణ జీవితం, అంతము లేని జీవితం, నిన్ను తెలుసుకోవడమే వారికి నిత్య జీవము అద్వితీయుడవు నీవు సత్యదేవుడును, నీవు పంపిన యేసుక్రీస్తును కూడా.

మీరు ఇంతకు ముందు ఈ మార్గంలో వెళ్ళారా దేవుడే మీ మార్గదర్శిగా ఉన్నడా ? ఏంటి మీ అనుభవాలు

వాక్యము

ఈ ప్రణాళిక గురించి

30 రోజుల్లో కీర్తన గ్రంధం

"కీర్తనల గ్రంధం లో 150 పద్యాలు మరియు కీర్తనలు ఉన్నాయి.దేవునిపై నమ్మకం తో ఉండే ప్రజల బాధ, భయం, ఆనందం మరియు ఆశ ను వ్యక్త పరుస్తాయి ఈ 30 రోజుల ధ్యానం లో శతాబ్దాల నాటి ఈ పదాలు మీ స్వంత భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి, కొత్త ఆశను కనుగొనడానికి మరియు మీ విశ్వాసంలో బలపడటానికి ఎలా సహాయపడతాయో తెలుసుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. "

More

ఈ ప్రణాళికను అందించినందుకు GlobalRize కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: www.globalrize.org