30 రోజుల్లో కీర్తన గ్రంధంనమూనా

30 రోజుల్లో కీర్తన గ్రంధం

30 యొక్క 20

దేవుణ్ణి ఘనపరిచే జీవితాన్ని జీవించడం

"యెహోవా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. (కీర్తన :19:14)

చాలా మందికి కట్టడలను అనుసరించడం ఇష్టం ఉండదు.అయినప్పటికీ దావీదు ఇలా అభ్యర్థిస్తాడు అది దేవుని జ్ఞానాన్ని ప్రతిబింబిస్తుందని మరియు ఏ మనిషి కూడా మనకు ఇవ్వగల దానికంటే సరైన ఉపాయమును అందిస్తుందని అతను నేర్చుకున్నాడు:

"యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవిహృదయమును సంతోషపరచును యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును." (కీర్తన :19:8)

దావీదు దేవుని ధర్మశాస్త్రాన్ని ఎందుకు అంతగా ఇష్టపడతాడు?ప్రభువు ఆజ్ఞలను అనుసరించడం వలన పెద్ద పొరపాట్లు జరగకుండా మనల్ని ఆపుతుంది .కానీ దావీదు దేవుని ఆజ్ఞలను పాటించడమే కాదు ఎందుకంటే అది గొప్ప సహాయం.కూడా దేవుణ్ణి ఘనపరచాలి అని దావీదు ఆశ తన మాటలు, ఆలోచనలు కూడా దేవునికి ఇష్టమైనవిగా ఉండాలని కోరుకుంటాడు.ఈ ఆదర్శానికి తాను ఎల్లప్పుడూ తగినట్టుగా జీవించలేనని దావీదుకు తెలుసు.అతను దేవుని దృష్టిలో అన్నివేళలా అంగీకారంగా ఉండలేడు.అని పాపానికి వ్యతిరేకంగా పోరాడాడటానికి మరియు హ్రదయాన్ని మార్చమని దేవుని సహాయం కోరుతాడు

మీరు దావీదు చెప్పిన ఈ మాటలను అంగీకరిస్తారా ?మీరు కూడా దేవుని ఆజ్ఞనలుగా మీ జీవితానికి మార్గాలుగా అంగీకరిస్తున్నారా మరియు ప్రతి మాటలో లేదా ఆలోచనలో ఆయనను గౌరవించాలనుకుంటున్నారా?

ఈ ప్రణాళిక గురించి

30 రోజుల్లో కీర్తన గ్రంధం

"కీర్తనల గ్రంధం లో 150 పద్యాలు మరియు కీర్తనలు ఉన్నాయి.దేవునిపై నమ్మకం తో ఉండే ప్రజల బాధ, భయం, ఆనందం మరియు ఆశ ను వ్యక్త పరుస్తాయి ఈ 30 రోజుల ధ్యానం లో శతాబ్దాల నాటి ఈ పదాలు మీ స్వంత భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి, కొత్త ఆశను కనుగొనడానికి మరియు మీ విశ్వాసంలో బలపడటానికి ఎలా సహాయపడతాయో తెలుసుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. "

More

ఈ ప్రణాళికను అందించినందుకు GlobalRize కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: www.globalrize.org