30 రోజుల్లో కీర్తన గ్రంధంనమూనా

30 రోజుల్లో కీర్తన గ్రంధం

30 యొక్క 19

ఈ శ్రుష్టి కనపరుస్తుంది దేవుని గొప్పదనం

ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.(కీర్త:19:1)

మీరు ఎప్పుడైనా రాత్రి వేళలో నిర్మలమైన ఆకాశం వైపు చూసారా ?వేసవి రోజున తేలియాడే మేఘాలను మీరు ఎప్పుడైనా గమనించి చూసారా ?ఈరోజు వచనం ఆకాశమహాకాశములు దేవుని చేతిపని అని మనకు చెబుతుంది.అవి వాటి సృష్టి కర్త యొక్క మహిమను ప్రచురిస్తాయి విశ్వం ఎంత విశాలమైనదో ఎన్నెన్ని నక్షత్రాలు గ్రహాలూ ఉన్నాయో మీరు గ్రహించినప్పుడు దేవుని గొప్పసృష్టి తెలుస్తుంది ఆయన భూమిని సృష్టించాడు, మనల్ని మానవులుగా సృష్టించాడు, కానీ ఆయన సృష్టి లో ఇంకా చాలా చేశాడు.నిజానికి, ఆయన సృష్టి ఎంత గొప్పదో మనకు తెలియదు.ఈ అద్భుతమైన ప్రకృతి మనల్ని , ఆశ్చర్యంతో నింపేస్తుంది. విశ్వం కేవలం యాదృచ్ఛికంగా అభివృద్ధి చెందిన, ప్రదేశం కాదు.ఇది జాగ్రత్తగా ఒక ప్రణాళిక లో తయారు చేయబడింది, అది దేవుని క్రమాన్ని మరియు జ్ఞానాన్ని కనపరుస్తుంది .అయినప్పటికీ..మానవుల పాపం వల్ల ఆకాశమహాకాశాలు కూడా దెబ్బతిన్నాయి. సృష్టి అంతా ఇదే. కాబట్టి, దేవుడు మరల క్రొత్త ఆకాశాలను, క్రొత్త భూమిని సృష్టిస్తాడు.(యెషయా 65 చూడండి)

దేవుని మహిమ పరిపూర్నంగా కనపరుచు దినము కొరకు మీరు కూడా ఎదురుచూస్తున్నారా?

వాక్యము

ఈ ప్రణాళిక గురించి

30 రోజుల్లో కీర్తన గ్రంధం

"కీర్తనల గ్రంధం లో 150 పద్యాలు మరియు కీర్తనలు ఉన్నాయి.దేవునిపై నమ్మకం తో ఉండే ప్రజల బాధ, భయం, ఆనందం మరియు ఆశ ను వ్యక్త పరుస్తాయి ఈ 30 రోజుల ధ్యానం లో శతాబ్దాల నాటి ఈ పదాలు మీ స్వంత భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి, కొత్త ఆశను కనుగొనడానికి మరియు మీ విశ్వాసంలో బలపడటానికి ఎలా సహాయపడతాయో తెలుసుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. "

More

ఈ ప్రణాళికను అందించినందుకు GlobalRize కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: www.globalrize.org