30 రోజుల్లో కీర్తన గ్రంధంనమూనా

30 రోజుల్లో కీర్తన గ్రంధం

30 యొక్క 18

దేవునికి అన్నీ సాధ్యమే

నీ సహాయమువలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయమువలన ప్రాకారమును దాటుదును.(కీర్తన:18:28)

జీవితం ఎప్పుడూ ఒక సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా క్రైస్తవ జీవితం అంత సులువైనది కాదు ఎప్పుడూ మన పాపకోరికలను జయించుటకు పోరాడాల్సి వస్తుంది లేదా ఆత్మపోరాటం చేయాల్సి వస్తుంది లేదా మన చుట్టూ ఉండే వారితో వ్యతిరేకత ఎదురుకోవలసి వస్తుంది, ఆ దుష్ట ప్రభావాలన్నింటినీ ఎదిరించి, దేవుని మార్గంలో నడవడానికి మీకు శక్తి లేదని మీరు భావించవచ్చు. మరియు నిరుత్సాహంగా, అనిపస్తుంది .అలా అయితే, ఈరోజు వచనం మిమ్మల్ని ఓదారుస్తుంది.

ఇది మీ శక్తి గురించి కాదు. దేవుని శక్తి గురించి. దేవునికి అన్ని సాధ్యమే నిజానికి అది అయన శక్తి బలహీనతయందు పూర్ణుడుగా చేయబడును. పౌలు ఈ వాస్తవాన్ని చూస్తాడు అందుకు నా కృప నీకు చాలును, "బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును" ( 2 కోరంథి :12:9)

దావీదు కూడా అదే చేసాడు : తన గొప్ప దేవుని గురించి గొప్పగా చెప్తాడు. దేవునితో , దావీదు తనకు అవసరమైనది . పూర్తిగా అసాధ్యమైన పనులు కూడా.చేయగలడు అని, మీరు ఇంకా మీ సొంత శక్తి తో పోరాడుతున్నారా లేక దావీదు మరియు పౌలు కీర్తనలతో ఏకిభవిస్తారా?

వాక్యము

ఈ ప్రణాళిక గురించి

30 రోజుల్లో కీర్తన గ్రంధం

"కీర్తనల గ్రంధం లో 150 పద్యాలు మరియు కీర్తనలు ఉన్నాయి.దేవునిపై నమ్మకం తో ఉండే ప్రజల బాధ, భయం, ఆనందం మరియు ఆశ ను వ్యక్త పరుస్తాయి ఈ 30 రోజుల ధ్యానం లో శతాబ్దాల నాటి ఈ పదాలు మీ స్వంత భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి, కొత్త ఆశను కనుగొనడానికి మరియు మీ విశ్వాసంలో బలపడటానికి ఎలా సహాయపడతాయో తెలుసుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. "

More

ఈ ప్రణాళికను అందించినందుకు GlobalRize కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: www.globalrize.org