యేసుతో ముఖాముఖిSample

పూర్తి సమయం దేవునికి సమర్పించుకొని దేవాలయంలో వృద్ధుడైన యాజకుని మార్గదర్శకత్వంలో ఉన్న ఒక చిన్న బాలుడు ఒంటరిగా ఉన్నాడు. దేవుడు సమూయేలుతో మొదట మాట్లాడిన సందర్భం అది. సమూయేలు ప్రభువు యొక్క శక్తివంతమైన ప్రవక్తగా ఎదిగాడు,అతని మాటలు ఏవీ వృధాగా పోలేదు. దాని వెనుక ఉన్న అర్ధం అతడు దేవుని స్వరానికి అనుసంధానించబడిన చెవిని కలిగి ఉన్నాడు,అతను మాట్లాడే ప్రతిదీ దేవుడు అతనికి ఇచ్చాడు కాబట్టి ఆ పదాలు నిరుపయోగమైనవిగా గానీ లేదా ప్రభావరహితమైనవిగా గానీ లేవు. అది అద్భుతం కాదా?సమూయేలు పని సులభమైనది కాదు ఎందుకంటే అతడు హృదయంలో దారితప్పిన మనుష్యులకు పరిచర్య చేశాడు.
చివరికి తమకు రాజు కావాలని వారు అడిగారు. వారు పైకి చెప్పకపోయినా వారి పూర్తి ఉద్దేశం,వారు ఇక మీద సమూయేలు నోటి నుండి ఉపదేశం మరియు మార్గదర్శకత్వం కోసం దేవుని వాక్యాన్ని కోరుకోవడం లేదు. ఇరుగుపొరుగు దేశాలన్నిటి వలెనే తమను కూడా యుద్ధంలో నడిపించే మరియు తమను పరిపాలించే వ్యక్తిని వారు కోరుకున్నారు. దేవుడు వారిని ప్రత్యేక పరచాలని కోరినప్పుడు వారు వలే ఉండడానికి కోరుకున్నారు.
సమూయేలు ఆ తిరస్కరణను ఎదుర్కొంటున్నప్పుడు,ప్రజలు సమూయేలును తిరస్కరించలేదని వారు తననే తిరస్కరించారని దేవుడు సమూయేలుతో చెప్పాడు. దేవుడు ఆజ్ఞాపించిన విధంగా చెయ్యడానికి వెళ్ళాడు,సౌలును ఇశ్రాయేలుకు మొదటి రాజుగా అభిషేకించాడు,అయితే ఒక రాజు ప్రజల నుండి ఏమి కోరతాడో వారికి చట్టబద్ధమైన హెచ్చరికలు ఇచ్చాడు. సమూయేలు తన జీవిత కాలం అంతా తన శ్రవణ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు మరియు అతను దేవుని ఆత్మతో ఎల్లప్పుడూ సంబంధాన్ని కలిగి ఉన్నాడు.
మిమ్ములను మీరు ప్రశ్నించుకోవలసిన ప్రశ్నలు::
మీ కోసం దేవుని చిత్తంలో స్పష్టంగా లేని వాటి విషయంలో మీరు దేవుణ్ణి ఏమి అడుగుతున్నారు?
పరిశుద్ధాత్మ స్వరానికి మీరు ఎంతగా ఐక్యపరచుకున్నారు?
మీ భావోద్వేగాలను సరిచేసుకోవడంలోనూ మరియు అనవసరమైన వాటిని తొగించివెయ్యడంలోనూ మీకు సహాయం చేయడానికి మీరు పరిశుద్ధాత్మను అనుమతిస్తారా?
About this Plan

మనతోనూ, మనలోనూ తన నివాసాన్ని చేసుకొన్న మన నిత్యుడైన దేవుని గురించి పరిచితమైన సత్యాలతో మనలను మనం సేదదీర్చుకోడానికి శ్రమల కాలము ఒక గొప్ప సమయం. ఈ బైబిలు ప్రణాళిక ద్వారా, ఇది ఒక దిక్సూచిగా మిమ్ములను సంపూర్ణంగా పూర్తి నూతన స్థాయిలో యేసుతో సమయాన్ని అనుభవించుటకు నడిపించే దేవుని వాక్యముతో ఈ 40 రోజులూ ప్రతి దినం కొన్ని నిమిషాలు వెచ్చిస్తారు అని మా నిరీక్షణ.
More
Related Plans

Prayer Altars: Embracing the Priestly Call to Prayer

One Chapter a Day: Matthew

Moses: A Journey of Faith and Freedom

Faith-Driven Impact Investor: What the Bible Says

Horizon Church August Bible Reading Plan: Prayer & Fasting

Journey Through Genesis 12-50

Walk With God: 3 Days of Pilgrimage

Psalms of Lament

The Way of the Wise
