యేసుతో ముఖాముఖిSample

యోనా మనందరిలాంటి మనిషి. దేవుని మాట విని వ్యతిరేక దిశలో పారిపోయాడు. అతనికి అప్పగించబడిన పని చాలా దూరం అనిపించింది మరియు అతడు దేవునినుండి అధిగమించగలడని భావించాడు. ఎంత హాస్యాస్పదం! దావీదు కీర్తన 139 వచనాలు 7 నుండి 12 వరకు వచనాలలో మనం దేవుని నుండి ఏవిధంగానూ తప్పించుకోలేము అని వ్రాయాబది ఉంది. యోనా దేవుని శక్తి మరియు బలం ద్వారా తిరిగి సరియైన మార్గంలోనికి తీసుకురాబడ్డాడు మరియు చివరికి నీనెవె యొక్క రక్షణను కన్నులారా చూసాడు. తనమీద పై ఎంత కృప చూపించ బడిందో చూపబడ్డాడో మర్చిపోయి దుష్ట దేశం పట్ల దేవుని కృప మరియు దయ గురించి పెద్ద కేకలు,భ్రమ మాటలు మాట్లాడటం కారణంగా ముఖ్య అంశాన్ని కోల్పోయాడు.
ఎంత తరచుగా మనం మరొకరిని చూసి దేవుని పక్షంగా వారిని రద్దు చేస్తాము. వారి పాపం చాలా పెద్దదని,వారి జీవితం చాలా నీచంగా ఉందని లేదా దేవుడు జోక్యం చేసుకొని వాటిని మార్చలేని విధంగా వారి ఎంపికలు చాలా పేలవంగా ఉన్నాయని మేము భావిస్తాము. మన అసంఖ్యాకమైన పాపాలను మరియు లోపాలను క్షమించడంలో దేవుడు మన పట్ల ఎంత కృప కలిగియున్నాడో మనం మరచిపోతాము. చాలా అత్యవసరంగా ఉన్న వారి నుండి కృప,దయ మరియు కరుణను నిలిపివేస్తాము. యేసులో,ఆయనపై మన విశ్వాసం మరియు నమ్మకం ఉంచినప్పుడు కృప మనకు ఇవ్వబడింది. మనం సంపాదించలేదు లేదా దానికి అర్హత పొందలేదు. ఇది ఉచిత బహుమతి- మనం వీలైనంత తరచుగా ఇతరులకు అందించాలి.
మిమ్ములను మీరు ప్రశ్నించుకోవలసిన ప్రశ్నలు:
దేవుడు నా నుండి నన్ను ఏవిధంగా రక్షించాడో నేను మర్చిపోయానా?
నేను ఎవరి నుండి కృప మరియు దయను అడ్డుకున్నాను?
నేను దీని గురించి పశ్చాత్తాపపడి మనుష్యులను ప్రేమించడం మరియు అంగీకరించడం ప్రారంభించవచ్చా?
About this Plan

మనతోనూ, మనలోనూ తన నివాసాన్ని చేసుకొన్న మన నిత్యుడైన దేవుని గురించి పరిచితమైన సత్యాలతో మనలను మనం సేదదీర్చుకోడానికి శ్రమల కాలము ఒక గొప్ప సమయం. ఈ బైబిలు ప్రణాళిక ద్వారా, ఇది ఒక దిక్సూచిగా మిమ్ములను సంపూర్ణంగా పూర్తి నూతన స్థాయిలో యేసుతో సమయాన్ని అనుభవించుటకు నడిపించే దేవుని వాక్యముతో ఈ 40 రోజులూ ప్రతి దినం కొన్ని నిమిషాలు వెచ్చిస్తారు అని మా నిరీక్షణ.
More
Related Plans

Winter Warm-Up

EquipHer Vol. 24: "Who’s Economy Are You Working For?"

Cultivating a Satisfying Marriage: Leading, Serving, and Discipling Together

Find & Follow Jesus, Quarter 3

The Boom Squad: Young Hero Training

Go Into All the World

The Cultivation of Consistency

How to Find Jesus for Yourself

Thy Kingdom Come - Prayer Journal
