YouVersion Logo
Search Icon

యేసుతో ముఖాముఖిSample

యేసుతో ముఖాముఖి

DAY 8 OF 40

గిద్యోను ద్రాక్షా గానుగలో రహస్యంగా గోధుమలను నూర్పిడి చేస్తున్నప్పుడు ప్రభువు దూత అతనిని ఎలా సంబోధించాడో చూడటం ఆశ్చర్యంగా ఉంది. అతడు స్పష్టంగా మిద్యానీయులకు భయపడుతున్నాడు,మరియు గానుగ చాటున పని చేస్తున్నాడు,అయితే అతడు " పరాక్రమముగల బలాఢ్యుడా" అని పిలువబడ్డాడు. వావ్! దేవుడు మనలను మనం చూసే దానికి భిన్నంగా ఎంత భిన్నంగా చూస్తాడు. "దేవుడు నీతో ఉన్నాడు" అని దేవదూత గిద్యోనుతో ఎలా చెప్పాడనేది కూడా ఆసక్తికరంగా ఉంది మరియు గిద్యోను ఒక ప్రశ్న "ప్రభువు మాతో ఉంటే,ఇవన్నీ మనకు ఎందుకు జరిగాయి?"అని అడిగాడు. గిద్యోను తన కోసం మాత్రమే కాకుండా తన మనుష్యుల కోసం అడిగాడు. అది నాయకత్వానికి చిహ్నం మరియు దేవుడు దానిని గిద్యోను తనలో చూడకముందే అతనిలో చూశాడు. గిద్యోను అడుగడుగునా దేవుని వాక్యాన్ని పరీక్షిస్తున్నప్పటికీ,దేవుడు చాలా ఓపికగా ఉన్నాడు మరియు ప్రతిసారీ అతనికి సమాధానం ఇస్తాడు.

గిద్యోను మిద్యానీయులకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో దశలవారీగా నడిపించబడ్డాడు మరియు ఇది చాలా అసాధారణమైన యుద్ధ వ్యూహం అయినప్పటికీ అతడు దేవుని హస్తాన్ని కలిగి యున్నాడు. యుద్ధం కోసం సైనికులను ఎన్నుకోవడంలో కూడా దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు వారు మితిమీరిన ఆత్మవిశ్వాసం కలిగియుండకూడదు,మరియు దారి తప్పి బయటపడకూడదని అతడు కోరుకుంటున్నాడు. యుద్ధరంగంలో ఆ రోజు పెద్ద విజయం సాధించినప్పటికీ,గిద్యోను ముగింపు సరిగా అంతం కాలేదు. అతడు ఇశ్రాయేలీయులను విగ్రహారాధనలోనికి నడిపించాడు మరియు అది అతని కుటుంబానికి ఒక ఉచ్చు అయ్యింది.

మిమ్ములను మీరు ప్రశ్నించుకోవలసిన ప్రశ్నలు:
ఈ సమయంలో దేవుడు బయటకు తీయాలనుకున్న దాచబడిన వరం నాలో ఏమైనా ఉందా?
దేవుడు నిన్ను ఏ రోజు ఏమని పిలుస్తున్నాడు?పరాక్రమం గల పురుషుడు/స్త్రీ?ప్రియమైన వాడవు?ఆయన స్వరాన్ని వినండి.
నేను సరిగా ముంగించడానికి సమర్పించుకొని ఉన్నానా?

About this Plan

యేసుతో ముఖాముఖి

మనతోనూ, మనలోనూ తన నివాసాన్ని చేసుకొన్న మన నిత్యుడైన దేవుని గురించి పరిచితమైన సత్యాలతో మనలను మనం సేదదీర్చుకోడానికి శ్రమల కాలము ఒక గొప్ప సమయం. ఈ బైబిలు ప్రణాళిక ద్వారా, ఇది ఒక దిక్సూచిగా మిమ్ములను సంపూర్ణంగా పూర్తి నూతన స్థాయిలో యేసుతో సమయాన్ని అనుభవించుటకు నడిపించే దేవుని వాక్యముతో ఈ 40 రోజులూ ప్రతి దినం కొన్ని నిమిషాలు వెచ్చిస్తారు అని మా నిరీక్షణ.

More