YouVersion Logo
Search Icon

Plan Info

యేసు మాత్రమేSample

యేసు మాత్రమే

DAY 4 OF 9

యేసు మాత్రమే – అద్భుతాలు చేసేవాడు యేసు దేవుని కుమారుడు. వాస్తవానికి అద్భుతమైన రీతిలో బయలుపరచబడిన విధంగా ఆయన శరీరదారియైన దేవుడు, ఆ కారణంగా ఆయన మనుష్యులను స్వస్థపరచాడు, పునరుద్ధరించాడు, పునరుజ్జీవింప చేసాడు. ఆయన ఒక సాధారణ మత బోధకుడు కాదు, ఖచ్చితంగా కాదు! యోహాను 21:25 వచనం ఇలా చెపుతుంది, “యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసినయెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది.” ఈ రోజు వాక్యభాగాలలో, యేసు చేసిన మూడు మానవాతీత స్వస్థతలను మనం హెచ్చించి చూద్దాం. మత్తయి సువార్త 8 అధ్యాయం 1 - 4 వ వచనాలలో, యేసు కుష్ఠురోగిని కలుస్తున్నాడు, అతడు యేసుతో తన సంభాషణను "ప్రభువు" అని సంబోధించడం ద్వారా ప్రారంభిస్తున్నాడు. అద్భుతాన్ని అనుభవించాలంటే మనం దేవుడిని దేవునిగా స్పష్టంగా గుర్తించాలి. తరచుగా మన స్వస్థతను మన ఇంగితజ్ఞానానికీ, వైద్యుల జోక్యానికీ లేదా మనం తీసుకునే మందులకూ ఆపాదిస్తాము. ఇవన్నీ ఖచ్చితంగా దేవుని మంచితనం, మన పట్ల ఆయన వహించే శ్రద్ధకూ సాధనాలుగా ఉన్నప్పటికీ  యేసు ప్రభువు కారణంగానే, మనం స్వస్థత పొందుతున్నాము. మత్తయి సువార్త 8 అధ్యాయం 5 - 13 వ వచనాలలో, ప్రభువైన యేసును రోమా శతాధిపతి కలుసుకున్నాడు, అతని సేవకుడు చాలా అనారోగ్యంతో ఉన్నాడు. యేసు వచ్చి ఆ వ్యక్తిని స్వస్థపరుస్తానని చెపుతుండగా, తన సేవకుడు స్వస్థత పొందేలా ఒక మాట చెప్పమని శాతాదిపతి ప్రభువుకు చెప్తాడు. యేసుకు స్వస్థత చేకూర్చే అధికారం ఉందనీ, దూరంగా ఉండి కూడా తన సేవకుడు స్వస్థ పరచబడడానికి ఆయన నోటనుండి ఒక్క మాట చాలు అని శాతాదిపతి సరిగా అర్థం చేసుకొన్నాడు. యేసు దేవుడిగా మానవ అవతారం అని నిజంగా విశ్వసించిన కారణంగా యేసు అధికారంమీద ఆయనకు అటువంటి విశ్వాసం ఉంది. అద్భుతం కోసం ఎటువంటి వివరణ! సాధారణ విశ్వాసం, యేసు అధికారంమీద పూర్తి నమ్మకంతో జతకలిసింది! లూకా సువార్త 5 అధ్యాయంలో, పక్షవాతం ఉన్న వ్యక్తి చిరస్మరణీయ కథనం ఉంది, అతని స్వస్థత కోసం స్నేహితులు అతనిని యేసు వద్దకు తీసుకువచ్చారు, అయితే యేసు బోధిస్తున్న ఇల్లు రద్దీగా ఉన్నందున అతన్ని యేసు దగ్గరికి తీసుకురావడానికి దారి వారికి కనపడలేదు. అప్పుడు వారు పైకప్పు తెరిచి, తమ స్నేహితుడిని ఇంట్లోకి దింపడానికి చూసారు, తద్వారా ఆయనకు యేసు దృష్టిని పొందగలుగుతారు. విశ్వసించిన సమాజానికికున్న విశ్వాసం చెయ్యగలిగిన దానికి ఇది ఒక శక్తివంతమైన వృత్తాంతం. 20 వ వచనం, ఆ మనిషి స్నేహితుల విశ్వాసాన్ని యేసు చూసినప్పుడు, ఆయన ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు అని చెపుతుంది. విశ్వాసుల సమూహం విశ్వాసంతో సమృద్ధిగా ఉన్నప్పుడు, ప్రాముఖ్యమైన కార్యం కోసం వారు నిర్విరామంగా దేవుణ్ణి వెంబడించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అద్భుతాలు పుష్కలంగా జరుగుతాయి. యేసును ప్రభువు అని అంగీకరించడం, ఆయనకు సర్వాదికారం ఉందని గుర్తించడం, ఆయన మీద మన పూర్తి విశ్వాసం ఉంచడం అద్భుత వాతావరణాన్ని కలిగిస్తాయి! ప్రార్థన : ప్రియమైన ప్రభువా, నీ శక్తి, బలములకు నేను కృతజ్ఞుడను. నేను నిన్నుగురించి నూతన విధానాలలో అనుభూతిని పొందడానికీ, ఇతరులు చూసి, నీకు మహిమను ఆపాదించేలా నా జీవితంలో నీవు అద్భుతాలు చేస్తూనే ఉండాలని ప్రార్థిస్తున్నాను! యేసు నామంలో ఆమేన్!
Day 3Day 5

About this Plan

యేసు మాత్రమే

ఈ గందరగోళ కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు గురించి మరింత తెలుసుకోడానికి యెంచుకోండి, అనిశ్చిత సమయాల్లో భయం విషయంలో విశ్వాసం కలిగియుండడానికి యెంచుకోండి. మీరు ఈ ప్రణాళికను చదువుతున్నప్పుడు ప్రతీ దినం ఏమి జరుగుతున్నప్పటికీ భవిష్...

More

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy