యేసు మాత్రమేSample

యేసు మాత్రమే- పాపుల స్నేహితుడు
సమాజం చేత గుర్తించబడినవారూ, తక్కువగా యెంచబడినవారూ, నిషేదించబడినవారుగా ఉన్న ప్రతిఒక్కరికీ ప్రభువైన యేసు స్నేహితుడిగా ఉన్నాడు. ఆయన వారిని తెలుసుకోవడానికి ఆయన వారిని ఒక్కొక్కరిగా వెదకుతున్నట్టుగా కనిపిస్తుంది. తరచుగా ఆయన వారి ఇళ్ళకు వెళ్ళడం, వారు తరచూ వెళ్లే ప్రదేశాలకు వెళ్ళడం, వారితో కలిసి భోజనం చేయడం, లేదా వారితో మాట్లాడటంలో సమయం గడపడం ద్వారా ఆయన దీనిని చాలా తరచుగా చేస్తూ వచ్చాడు. ఒకేలాంటి మనస్సు గల వారితోగానీ లేదా ఆయనతో కనబడడంలో సురక్షితంగా ఉండేవారితో మాత్రమే ఆయన కలవలేదు. ఆయన కలుసుకొన్న వారి విషయంలో సంప్రదేయతరంగా వ్యవహరించాడు. పాపులకోసం ఆయన శ్రేష్టమైన స్నేహితుడిగా ఉన్నాడు. నేటి వాక్య భాగాలలో మనం చూస్తున్న మూడు వేరువేరు సందర్భాలలో యేసును ఆయన అంతర్భాగంలో చూస్తాం - ఉద్రేకపూర్వకంగా ప్రేమించడం, సుదూరంగా ఉన్నవారినీ, ప్రేమించబడనివారినీ ఆయన తన ఆలింగనంలోనికి తీసుకోవడం చూస్తున్నాము. అనుకూలమైన పరిహాసమైన అంశం, రోమా 3:23 లో మనం చూసినట్లుగా మనలో ప్రతి ఒక్కరూ పాపులుగా ఉన్నాము. అందువల్ల మనమందరం ఎటువంటి మినహాయింపు లేకుండా క్రీస్తుతో స్నేహాన్ని పొందవచ్చు.
వ్యభిచారంలో చిక్కుకున్న స్త్రీని ఆయన కలిసినప్పుడు ఆయన స్పందన చాలా విలక్షణంగా ఉంది. ఆయన ఆ స్త్రీని ప్రశ్నించలేదు, బదులుగా "పాపం లేనివాడు మొదటి రాయిని విసిరి వెయ్యనియ్యండి" అని చెప్పడం ద్వారా ఆయన నిందలుమోపే వారిమీద తన గమనాన్ని నిలిపాడు. ఆయన ఆ స్త్రీని చూడడానికి ముందు ఆయన సందేశం వారిలో లోతుగా చొచ్చుకొనిపోయేలా సమయాన్ని అనుమతించాడు, ఇప్పుడు ఆయన ఒంటరిగా నిలబడి ఉన్నాడు, ఆపై జీవితాన్ని మార్చే ఏకైక వ్యాఖ్యను ఆయన చెపుతున్నాడు. “నేనునూ నిన్ను ఖండించను; వెళ్లి పాపం చేయవద్దు.” యేసు దయతో ఆ స్త్రీని ఒప్పించడం మాత్రమే కాక ఆమెపై ఆరోపణలు చేసేవారిని కూడా ఒప్పించడం ఆశ్చర్యంగా ఉంది కదా! యేసు మాత్రమే వారందరినీ దోషులుగా ఒప్పించగలిగే నైతిక స్థితిని కలిగి ఉండగలిగినవాడుగా ఉన్నాడు. అయితే ఆయన ఆ విధంగా చేయలేదు. యేసు మాత్రమే ఒకరిని అప్రయత్నంగానూ, సున్నితంగానూ ఒప్పించగలడు.
యోహాను సువార్త 9 వ అధ్యాయంలో, యేసు అంధుడిగా జన్మించిన వ్యక్తిని స్వస్థపరుస్తున్నాడు, స్వస్థత జరిగిన తరువాత యూదులు ఆ వ్యక్తినీ, అతని తల్లిదండ్రులను విచారించాలని నిర్ణయించుకున్నారు, ఎందుకంటే ఆ వ్యక్తి లేదా అతని తల్లిదండ్రుల జీవితాలలో పాపం వల్ల మనిషి గుడ్డితనం కలిగిందని వారు విశ్వసించారు. “పాపి” ప్రార్థనను దేవుడు వింటాడని వారు నమ్మలేదు. ‘ఇది పాపం వలన కలిగింది కాదు అయితే అతని జీవితంలో దేవుని మహిమ బయలుపరచబడడానికి ఇది కలిగింది’ అని యేసు చెప్పడం ద్వారా తన స్వంత అనుచరులు కలిగి ఉన్న తప్పుడు ఆలోచనను ఆయన సరిచేస్తున్నాడు. శిష్యుల దృక్పథంలో ఎటువంటి మార్పు జరిగిందో కదా! ఇతరుల సంఘర్షణలూ, వైఫల్యాలనూ మనం చూచే విధానంలో మన దృక్పథంలో కూడా మార్పు ఉండాలి. ఒక వ్యక్తి కథనం, లేదా నేపథ్యం తెలియనప్పుడు మనం కఠినమైన తీర్పులకు దూరంగా ఉండాలి. అనంతర ప్రభావాలు ప్రభువు యెరిగినప్పటికీ యేసు ఆ చూపులేనివానికి ఉదార కరుణ చూపించాడు.
లూకా 19 అధ్యాయంలో, యేసు యెరికో పట్టణంలోనికి ప్రవేశించి, ఒక మేడి చెట్టు వైపు చూస్తూ, పొట్టివాడూ, పన్ను వసూలు చేసే ఒక వ్యక్తిని పిలిచి, తన ఇంటికి అతనిని ఆహ్వానించాడు. ఆ సాయంత్రం, జక్కయ్య యేసుకు ఆతిథ్యమిస్తూ, అక్కడ ఉన్నవారిమధ్య నిలబడి, తాను ప్రజల నుండి దోచుకున్నదానికంటే 4 రెట్లు తిరిగి చెల్లిస్తానని వాగ్దానం చేశాడు. ఈ రకమైన హృదయ మార్పును కలిగియుండాలని యేసు అతనితో ఏమీ చెప్పలేదు అని మనకు తెలుస్తుంది. మనకు తెలిసినదంతా ఏమిటంటే, ఒక చెట్టు కొమ్మల నుండి ఆసక్తిగా చూస్తున్న పోట్టివాడైన ఒక మనిషిని యేసు గమనించి, అతనితో సంబంధాన్ని పెంచుకోవడానికి తన ఇంటిలోనికికి ప్రవేశించాడు. అతని పట్ల యేసు కలిగియున్న ఈ యదార్ధమైన ఆసక్తి మాత్రమే పశ్చాత్తాపంతో జక్కయ్యను మోకాళ్ళ వద్దకు తీసుకువచ్చింది.
ఈ దినం తీర్పు తీర్చకుండా, యదార్ధమైన కరుణ చూపుతూ, అప్పుడే కలుసుకొన్న వ్యక్తిని గురించి తెలుసుకోడానికి సమయం తీసుకోవడంలో ఒకరిని ఏవిధంగా ప్రేమించగలరో ఆలోచించండి. మీరు వారికి యేసు ముఖంగా ఉండవచ్చు.
ప్రార్థన: ప్రియమైన ప్రభువా, మాకులా పాపులుగా ఉండే వారికి స్నేహితుడిగా ఉండడానికి నీవు మాకు సహాయం చేయాలని మేము ప్రార్థిస్తున్నాము. మన మార్గాల్లో వెళ్తున్నవారికి మేము యేసు ముఖంగా ఉండడానికి నీవు మాకు సహాయం చేయాలని నేను ప్రార్థిస్తున్నాను. మేము నిన్ను ప్రేమిస్తున్నాము, మేము మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. యేసు నామంలో, ఆమేన్.
About this Plan

ఈ గందరగోళ కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు గురించి మరింత తెలుసుకోడానికి యెంచుకోండి, అనిశ్చిత సమయాల్లో భయం విషయంలో విశ్వాసం కలిగియుండడానికి యెంచుకోండి. మీరు ఈ ప్రణాళికను చదువుతున్నప్పుడు ప్రతీ దినం ఏమి జరుగుతున్నప్పటికీ భవిష్యత్తులోనికి ధైర్యంగా అడుగు పెడతారని మేము నిరీక్షిస్తున్నాము.
More
Related Plans

Nearness

After Your Heart

The Faith Series

Eden's Blueprint

"Jesus Over Everything," a 5-Day Devotional With Peter Burton

The Inner Life by Andrew Murray

Resurrection to Mission: Living the Ancient Faith

A Heart After God: Living From the Inside Out

The Intentional Husband: 7 Days to Transform Your Marriage From the Inside Out
