YouVersion Logo
Search Icon

కీర్తనలు 16

16
దావీదు రసికకావ్యము.
1దేవా, నీ శరణుజొచ్చియున్నాను, నన్ను కాపాడుము.
2–నీవే ప్రభుడవు, నీకంటె నాకు క్షేమాధారమేదియు
లేదని యెహోవాతో నేను మనవి చేయుదును
3నేనీలాగందును–భూమిమీదనున్న భక్తులే శ్రేష్ఠులు;వారు నాకు కేవలము ఇష్టులు.
4యెహోవాను విడచి వేరొకని అనుసరించువారికి
శ్రమలు విస్తరించును.
వారర్పించు రక్త పానీయార్పణములు నేనర్పింపనువారి పేళ్లు నా పెదవులనెత్తను.
5యెహోవా నా స్వాస్థ్యభాగము నా పానీయభాగము
నీవే నా భాగమును కాపాడుచున్నావు.
6మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను
శ్రేష్ఠమైన స్వాస్థ్యము నాకు కలిగెను.
7నాకు ఆలోచనకర్తయైన యెహోవాను స్తుతించెదను
రాత్రిగడియలలో నా అంతరింద్రియము నాకు
బోధించుచున్నది.
8సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపు
చున్నాను.
ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక
నేను కదల్చబడను.
9అందువలన నా హృదయము సంతోషించుచున్నది
నా ఆత్మ#16:9 మూలభాషలో : మహిమ. హర్షించుచున్నది
నా శరీరము కూడ సురక్షితముగా నివసించుచున్నది
10ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడచి
పెట్టవు
నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు#16:10 లేక, గోతినిచూడనియ్యవు.
11జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు
నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదు
నీ కుడిచేతిలో నిత్యము సుఖములుకలవు.

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in