YouVersion Logo
Search Icon

కీర్తనలు 12

12
ప్రధానగాయకునికి. అష్టమశ్రుతిమీద పాడదగినది. దావీదు కీర్తన.
1యెహోవా నన్ను రక్షింపుము, భక్తిగలవారు లేకపోయిరి
విశ్వాసులు నరులలో నుండకుండ గతించిపోయిరి.
2అందరు ఒకరితో నొకరు అబద్ధములాడుదురు
మోసకరమైన మనస్సుగలవారై ఇచ్చకములాడు
పెదవులతో పలుకుదురు.
3యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటిని
బింకములాడు నాలుకలన్నిటిని కోసివేయును.
4–మా నాలుకలచేత మేము సాధించెదము
మా పెదవులుమావి, మాకు ప్రభువు ఎవడని వారను
కొందురు.
5–బాధపడువారికి చేయబడిన బలాత్కారమును
బట్టియు
దరిద్రుల నిట్టూర్పులనుబట్టియు నేనిప్పుడే లేచెదను
రక్షణను కోరుకొనువారికి నేను రక్షణ కలుగజేసెదను
అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
6యెహోవా మాటలు పవిత్రమైనవి
అవి మట్టిమూసలో ఏడు మారులు కరగి ఊదిన వెండి
యంత పవిత్రములు.
7యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు
ఈ తరమువారి చేతిలోనుండి వారిని నిత్యము రక్షించెదవు.
8నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు
దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుదురు.

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for కీర్తనలు 12