యేసుతో ముఖాముఖి预览

యేసుతో ముఖాముఖి

40天中的第16天

యూదుల ధర్మ శాస్త్రం ప్రకారం కుష్ఠురోగులను ఆచారపరంగా అపవిత్రులుగా పరిగణిస్తారు. వారు కూడా సామాజిక బహిష్కృతులు,వీరికి నగర సరిహద్దులకు పరిమితికి వెలుపల గృహాలు ఇవ్వబడ్డాయి. వారు సాధారణ వ్యక్తుల చుట్టూ ఉన్నప్పుడు,వారి ఉనికి గురించి ఎదుటి వారిని హెచ్చరించడానికి వారు “మేము అపవిత్రులము,మేముఅపవిత్రులము" అని గట్టిగా అరవాలి. ఎంత విచారకరమైన ఉనికి! అయితే ప్రభువైన యేసు ఈ భూమి మీదకు పైకి వచ్చి మనుష్యులకు పరిచర్య చేయడం ప్రారంభించినప్పుడు,ఆయనవారిని గుర్తించడం మాత్రమే కాదు, నిజానికి ఆయన వారిని చేతితో తాకి స్వస్థపరిచాడు. అవును మీరు సరిగ్గా చదివారు- ఆయన వారిని తాకాడు. వారి చేతులకు తెరువబడిన, చీము స్రవించే పుండ్లు కలిగి ఉండ వచ్చు అయినా ఆయన వాటిని పట్టించుకోలేదు. అవి అంటువ్యాధి కావచ్చు అని ఆయన పట్టించుకోలేదు. ఆయన కరుణతోనూ మరియు యదార్ధమైన ప్రేమతోనూ వారిని హత్తుకున్నాడు.‘అతను సిద్ధమయ్యాడు’అని సమాధానమివ్వడం ద్వారా తనను స్వస్థపరచడానికి‘ఇష్టపడుతున్నావా’అని అడిగిన ఈ కుష్ఠురోగి తడబాటును ఆయన సంబోధించడం ఎంతో ఆశ్చర్యంగా ఉంది!

మన అపవిత్రత,అది ఎలా కనిపించినా,యేసును మన నుండి దూరం చేయదు. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే మిమ్మల్ని కలవడానికి మరియు మీ స్రవించే,విరిగిన మరియు దుర్వాసన వెదజల్లుతున్న గాయాలను తాకడానికి ఆయన ఇష్టంగా ఉన్నాడు. ఆయన మిమ్మును స్వస్థపరచడానికీ, మిమ్మును పునరుద్ధరించి సంపూర్ణునిగా చెయ్యడానికీ సిద్ధంగా ఉన్నాడు. మిమ్మల్ని మీరు ఆయనమీద ఆధారపడేలా తగినంత నిస్సహాయునిగా చేసుకోవడం మీద అది ఆధారపడి ఉంటుంది.

మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవలసిన ప్రశ్నలు:
మీలో ఏదైనా భాగం అపవిత్రమైనది అని మీకు తెలిసి ఉందా?
మీరు యేసును పిలిచి,మీ బాధలోనికి ఆయనను ఆహ్వానిస్తారా?
మీ జీవితంలోని అంటరాని భాగాలను తాకడానికి మీరు ఆయనను అనుమతిస్తారా?

读经计划介绍

యేసుతో ముఖాముఖి

మనతోనూ, మనలోనూ తన నివాసాన్ని చేసుకొన్న మన నిత్యుడైన దేవుని గురించి పరిచితమైన సత్యాలతో మనలను మనం సేదదీర్చుకోడానికి శ్రమల కాలము ఒక గొప్ప సమయం. ఈ బైబిలు ప్రణాళిక ద్వారా, ఇది ఒక దిక్సూచిగా మిమ్ములను సంపూర్ణంగా పూర్తి నూతన స్థాయిలో యేసుతో సమయాన్ని అనుభవించుటకు నడిపించే దేవుని వాక్యముతో ఈ 40 రోజులూ ప్రతి దినం కొన్ని నిమిషాలు వెచ్చిస్తారు అని మా నిరీక్షణ.

More