యేసుతో ముఖాముఖి预览

రోమా శతాధిపతికి మానవ ప్రమాణాల ప్రకారం అపారమైన అధికారం ఉంది. అతనికి సేవకులు మరియు అతడు నాయకత్వం వహించి నడిపించేసైనికులగుంపు ఉన్నారు. ఈ శతాధిపతి స్పష్టంగా ఎంపిక చేయబడిన వ్యక్తి,ఎందుకంటే అతడు తన సేవకులలో ఒకరి అవసరాల పట్ల కనికరం చూపించాడు. అతడు యేసు వద్దను సమీపించడం తన కుటుంబ సభ్యుల కోసం కాదు,తనఉద్యోగి కోసం. ఇంకా,సహజమైన మరియు అతీంద్రియ రాజ్యం మీద యేసు కలిగి ఉన్న శక్తినీ మరియు అధికారాన్నీ అతడు అర్థం చేసుకున్నట్లు కనిపిస్తుంది. ఆయన నోట నుండి వచ్చే వాక్కు తన సేవకుడికి స్వస్థత చేకూరుస్తుందని విశ్వసిస్తూ“ఒక మాట మాట్లాడు”అని ఆయనను వేడుకున్నాడు. అతని విశ్వాసాన్ని యేసు స్వయంగా మెచ్చుకున్నాడు మరియు అన్నింటికంటే అతడు యూదుడు కాదు. యేసును విశ్వసించిన మరియు ఆయన మాటను అనుసరించిన మొదటి అన్యజనులలో అతను ముఖ్యమైన వాడు.
యేసు నామం ఎంత శక్తివంతమైనదో మనం తరచుగా మరచిపోతుంటాము. దృశ్యమైన, మరియు అదృశ్యమైన రాజ్యాలపై ఆయనకు ఉన్న అధికారాన్ని మనం మరచిపోతాము. ఆయన ఎంత శక్తిమంతుడో,ఎంత బలమైనవాడోఅర్థం కాకుండా మనం భయంతో జీవిస్తున్నాం. రాజులకు రాజు మరియు ప్రభువులకు ప్రభువు కంటే మనం తరచుగా సాతానుకే అధిక ప్రాధాన్యతనూ, అధిక సమయాన్నీ ఇస్తుంటాము. ఇది మార్పుకు సమయం!
మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవలసిన ప్రశ్నలు:
నా కోసం దేవుని ప్రణాళికలపై దృష్టి పెట్టడానికి బదులు నా జీవితంలో శత్రువు ప్రమేయంపై నేను స్థిరపడ్డానా?
లోకంలో దృశ్యమైన మరియు అదృశ్యమైన ప్రతిదాని మీద యేసుకు ఉన్న అధికారం గురించి తెలుసుకోవడం ద్వారా నేను మరింత నమ్మకంగా ఎలా జీవించగలను?
读经计划介绍

మనతోనూ, మనలోనూ తన నివాసాన్ని చేసుకొన్న మన నిత్యుడైన దేవుని గురించి పరిచితమైన సత్యాలతో మనలను మనం సేదదీర్చుకోడానికి శ్రమల కాలము ఒక గొప్ప సమయం. ఈ బైబిలు ప్రణాళిక ద్వారా, ఇది ఒక దిక్సూచిగా మిమ్ములను సంపూర్ణంగా పూర్తి నూతన స్థాయిలో యేసుతో సమయాన్ని అనుభవించుటకు నడిపించే దేవుని వాక్యముతో ఈ 40 రోజులూ ప్రతి దినం కొన్ని నిమిషాలు వెచ్చిస్తారు అని మా నిరీక్షణ.
More