యేసుతో ముఖాముఖి预览

యేసుతో ముఖాముఖి

40天中的第19天

మిమ్మల్ని దేవుని సన్నిధికి తీసుకువెళ్లే స్నేహితులే మీరు గట్టిగా పట్టుకోవలసిన స్నేహితులు. ఈ మనుష్యులు పక్షవాతంతో ఉన్న ఒక వ్యక్తిని ప్రభువైన యేసు దగ్గరకు తీసుకొని వచ్చారు. యేసు తనకు తానుగా“కుమారుడా,భయపడకుము,నీ పాపములు క్షమించబడ్డాయి”అని చెప్పాడు. వాస్తవానికి ఆయన దేవుడు మాత్రమే చేయగలిగిన దానిని దేవునిగా ఆయన చేస్తున్నప్పుడు అయన దైవ దూషణ చేస్తున్నాడని భావించేలా శాస్త్రులను ఇది ప్రేరేపించింది. యేసు వారి ఆలోచనలను గ్రహించి వాటిని బయటికి చెప్పడం ఆసక్తికరంగా ఉంది.

మనం ఎంత తరచుగా సరైన విషయాన్ని చెపుతుంటాము,అయితేమన ఆలోచనలు చేదుతోనూ,తీర్పు తీర్చు వైఖరి మరియు అసూయతో ప్రముఖంగా ఉండేలా అనుమతిస్తున్నాము? మన ఆలోచనలకు కూడా దేవునికి జవాబుదారీగా ఉండదానికి ఇది మనకు మంచి జ్ఞాపిక,ఎందుకంటే మనలో ఉన్నది చివరికి బయటకు పోతుంది. అవి మన చుట్టూ విధ్వంసం కలిగించవచ్చు లేదా శాంతిని కలిగించవచ్చు.

మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవలసిన ప్రశ్నలు:
నేను ప్రార్థనలో ఇతరులను దేవుని సింహాసనంపైకి తీసుకువచ్చే స్నేహితుడిగా ఉన్నానా?
దేవుడు నాలో మార్పు తీసుకురావాలని కోరుకునే పునరావృత ఆలోచన/ఆలోచనలు ఏమైనా ఉన్నాయా?

读经计划介绍

యేసుతో ముఖాముఖి

మనతోనూ, మనలోనూ తన నివాసాన్ని చేసుకొన్న మన నిత్యుడైన దేవుని గురించి పరిచితమైన సత్యాలతో మనలను మనం సేదదీర్చుకోడానికి శ్రమల కాలము ఒక గొప్ప సమయం. ఈ బైబిలు ప్రణాళిక ద్వారా, ఇది ఒక దిక్సూచిగా మిమ్ములను సంపూర్ణంగా పూర్తి నూతన స్థాయిలో యేసుతో సమయాన్ని అనుభవించుటకు నడిపించే దేవుని వాక్యముతో ఈ 40 రోజులూ ప్రతి దినం కొన్ని నిమిషాలు వెచ్చిస్తారు అని మా నిరీక్షణ.

More