యేసుతో ముఖాముఖి预览

యేసు ధర్మశాస్త్రాన్ని బోధించే "మత" సంబంధమైన యువకులలో ఒక శాస్త్రిని కలిశాడు మరియు అతడు ధర్మశాస్త్రాన్ని కఠినంగా పాటించేవాడు. ఈ శాస్త్రికి యేసును అనుసరించాలనే ఆలోచనతో ఎంతో ఉత్సాహంగా అనిపించింది అయితే అనుసరించడానికి అయ్యే వెలను అతడు గుర్తించలేదు. అతనికి ఎప్పుడూ తల వాల్చుకోడానికి స్థలం లేని వ్యక్తిగా జీవితం ఎలాంటిదో చూడడానికి యేసు అతనికి సహాయం చేసాడు.
శిష్యత్వం ఖర్చుతో కూడుకున్నది. మనం ఉన్నవాటిని మరియు మనం కలిగి ఉన్నవాటిని అన్నిటినీ దేవుని ముందు ఉంచడానికి సిద్ధంగా ఉండాలని ఇది చాలాసార్లు కోరుతుంది. యేసు ఎవరి నుండీ ఎప్పుడూ సమర్పణను గట్టిగా అడుగలేదు. అయితే తన శిష్యులు తనను వెంబడించినప్పుడు వారు చెయ్యవలసిన దాని విషయంలో ఆయన ముందుండి నడిపించాడు. సమర్పణ అనేది నియంత్రణ కోసం మన అవసరాన్ని క్రమంగా విడిచిపెట్టడం, మరియు మనల్ని మనం చూసుకొనే దాని కన్నా ఎక్కువగా చూసుకొనే దేవునికి బాధ్యతను అప్పగించడం.
త్యాగం మరియు నిస్వార్థ జీవితం కోసం సౌకర్యం,విలాసంమరియు జీవితం కోసం విస్తారంగా ఉండడంలో మన అవసరాన్ని వదులుకోవడానికి మన సంసిద్ధత మనల్ని చూసే లోకం నుండి మనలను భిన్నంగా చేస్తుంది.
మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవలసిన ప్రశ్నలు:
సౌకర్యాన్ని వదులుకోవడానికి నేను ఎంత సిద్ధంగా ఉన్నాను?
నా జీవితంలో ఏ విభాగాలలో నేను ఇంకా దేవునికి సమర్పించు కోలేదు?
读经计划介绍

మనతోనూ, మనలోనూ తన నివాసాన్ని చేసుకొన్న మన నిత్యుడైన దేవుని గురించి పరిచితమైన సత్యాలతో మనలను మనం సేదదీర్చుకోడానికి శ్రమల కాలము ఒక గొప్ప సమయం. ఈ బైబిలు ప్రణాళిక ద్వారా, ఇది ఒక దిక్సూచిగా మిమ్ములను సంపూర్ణంగా పూర్తి నూతన స్థాయిలో యేసుతో సమయాన్ని అనుభవించుటకు నడిపించే దేవుని వాక్యముతో ఈ 40 రోజులూ ప్రతి దినం కొన్ని నిమిషాలు వెచ్చిస్తారు అని మా నిరీక్షణ.
More