యేసుతో ముఖాముఖి预览

ఎమ్మాయి గ్రామానికి వెళ్లే దారిలో తన ఇద్దరు అనుచరులకు యేసు కనిపించినప్పుడు ఆయన పిరికివానిగా ఉన్నట్టు కనిపించాడు. ఆయన వారికి తనను తాను బయలుపరచుకోలేదు అయితే వారి ఆలోచనలు మరియు భావాలను తనతో పంచుకోడానికి ఆయన వారిని అనుమతించాడు. ఆయన వారికి విషయాలను వివరించాడు, మరియు ఆయన ఎందుకు వచ్చాడో,ఎందుకుచనిపోయాడో మరియు సజీవునిగా తిరిగి ఎలా లేచాడో వివరించడానికి మోషే మరియు ప్రవక్తల కాలం నుండి వారికి సంఘటనలను తెలియపరచాడు. ఆయన వారికి బోధించేటప్పుడు మరియు వారికి విషయాలు వివరించినప్పుడు వారి హృదయాలు తమలో మండుతున్నట్లు వారు భావించారు.
పునరుత్థానుడైన రక్షకుడు అదే చేస్తాడు. ఆయన ఆత్మ మనకు తోడుగా ఉంటాడు,ఆయన మాటల్లోని దాగి ఉన్న సత్యాలను మనకు వెల్లడిస్తాడు,మనకు జరుగుతున్న విషయాలను కొంత అర్థం చేసుకోవడానికి మన జీవితంలోని బిందువులను కలుపుతాడు మరియు మన హృదయాలలో మండుతున్న అభిరుచిని ఉంచుతాడు. సజీవుడైన దేవుని ఆత్మ మనలోనూ మరియు మన ద్వారానూ చలించకుండా మనం జీవితాన్ని కొనసాగించలేము!
మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవలసిన ప్రశ్నలు:
మీరు పునరుత్థానమైన జీవితాన్ని గడపడానికి సిద్ధంగా ఉన్నారా?
ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని నడిపించడానికి దేవుని ఆత్మకు మీరు చోటు కల్పిస్తారా?
读经计划介绍

మనతోనూ, మనలోనూ తన నివాసాన్ని చేసుకొన్న మన నిత్యుడైన దేవుని గురించి పరిచితమైన సత్యాలతో మనలను మనం సేదదీర్చుకోడానికి శ్రమల కాలము ఒక గొప్ప సమయం. ఈ బైబిలు ప్రణాళిక ద్వారా, ఇది ఒక దిక్సూచిగా మిమ్ములను సంపూర్ణంగా పూర్తి నూతన స్థాయిలో యేసుతో సమయాన్ని అనుభవించుటకు నడిపించే దేవుని వాక్యముతో ఈ 40 రోజులూ ప్రతి దినం కొన్ని నిమిషాలు వెచ్చిస్తారు అని మా నిరీక్షణ.
More