యేసుతో ముఖాముఖి预览

యేసుతో ముఖాముఖి

40天中的第21天

ఒక వస్త్రపు అంచు అనేది ఒకరి యొక్క దుస్తుల అంచు. పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుచున్న ఒక స్త్రీ స్వస్థత పొందేందుకు ఒక అవకాశం తీసుకుని మరియు యేసు యొక్క వస్త్రం అంచును తాకాలని నిర్ణయించుకుంది. ఆమె అన్ని ఇతర ఎంపికలను ప్రయత్నించింది మరియు ఏదీ పని చేయలేదు. ఇది బహుశా ఆమె చివరి ఎంపిక మరియు అయినప్పటికీ యేసు యొక్క శక్తి మీద ఆమె విశ్వాసం చాలా ఖచ్చితమైనదిగా మరియు స్థిరంగా ఉంది. జనసమూహాలు రద్దీగా ఉన్నప్పటికీ,యేసు శక్తి తనను విడిచిపెట్టినట్లు భావించాడు మరియు ఎవరో తనను తాకినట్లు తెలుసుకోవడం ఆశ్చర్యంగా ఉంది. ఆయన విచారించినప్పుడు ఆమె ముందుకు వచ్చింది మరియు తన వృత్తాంతమును పంచుకుంది. ఆమె విశ్వాసం ఆమెను స్వస్థపరిచింది అని చెప్పడం ద్వారా ఆయన ఆమె స్వస్థతను ధృవీకరిస్తాడు!

కాబట్టి అనేక సార్లు మనకు ఒక పురోగతి అవసరమైనప్పుడు మనము"నాకు ఏమి అవసరమో దేవునికి ముందే తెలుసు" లేదా "బహుశా ఇది ఎప్పటికీ ఇలాగే ఉండబోతోంది" అని చెప్పి వెనుక అడుగువేస్తాము,. నీవు చేయవలసిందల్లా రక్షకునికి దగ్గరగా త్రోసికొనిపోవడం మాత్రమే,తద్వారా ఆయన స్వస్థత ప్రభావం నీకు ప్రవహిస్తుంది.మీ అద్భుతం కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూసిన తరువాత మీరు యేసుతో సన్నిహితంగా మరియు వ్యక్తిగతంగా ఉండటం ద్వారా "ఆయన వస్త్రపు అంచు" తాకే సమయం ఇప్పుడే ఆసన్నమైన యెడల నీవు ఏమి చేయాలి?

మిమ్ములను మీరు ప్రశ్నించుకోవలసిన ప్రశ్నలు:
నన్ను స్వస్థపరచడానికి అయన స్పర్శ కోసం నేను దేవునికి బహిర్గతం కావడానికి భయపడే ప్రాంతం నా జీవితంలో ఏదైనా ఉందా?
ప్రతి దినము దేవుని యొక్క సన్నిధి లోనికి ప్రవేశించడంలో నేను కలిగి ఉండుటకు నాకు సహాయపడే ఒక క్రమశిక్షణ నా జీవితంలో ఉందా?

读经计划介绍

యేసుతో ముఖాముఖి

మనతోనూ, మనలోనూ తన నివాసాన్ని చేసుకొన్న మన నిత్యుడైన దేవుని గురించి పరిచితమైన సత్యాలతో మనలను మనం సేదదీర్చుకోడానికి శ్రమల కాలము ఒక గొప్ప సమయం. ఈ బైబిలు ప్రణాళిక ద్వారా, ఇది ఒక దిక్సూచిగా మిమ్ములను సంపూర్ణంగా పూర్తి నూతన స్థాయిలో యేసుతో సమయాన్ని అనుభవించుటకు నడిపించే దేవుని వాక్యముతో ఈ 40 రోజులూ ప్రతి దినం కొన్ని నిమిషాలు వెచ్చిస్తారు అని మా నిరీక్షణ.

More