యేసుతో ముఖాముఖి预览

యేసుతో ముఖాముఖి

40天中的第15天

బైబిలులో ప్రపంచ స్థాయి సంభాషణలు నమోదు చెయ్యబడ్డాయి,వాటిలో ఒకటి అరణ్యంలో సాతాను మరియు యేసు మధ్య జరిగిన సంభాషణ. యేసు నలభై రోజులు ఉపవాసం ఉన్నాడు మరియు పరిశుద్ధాత్మ ద్వారా అరణ్యంలోనికి నడిపించబడ్డాడు. ఉత్తమమైనది కాని పరిస్థితిలో సాతాను ప్రత్యక్షం అయ్యాడు,దేవుని కుమారుడిని దూషించడం ఆరంభించాడు. అతడు మొదట శారీరక ఆకలిని ప్రస్తావిస్తూ,రాళ్లను రొట్టెగా మార్చే చవకైన మంత్ర జాల కిటుకును యేసును అడిగాడు. తరువాత ఎత్తైన భవనం నుండి తనను తాను త్రోసివేసుకోవడం,మరియు సజీవునిగా చేసుకోవడం వంటి అద్భుతమైన కార్యాలను జరిగించమని యేసును సవాలు చేసాడు. చివరకు తనకు నమస్కరించి ఆరాధిస్తే ప్రపంచ దేశాలను పరిపాలించే అవకాశాన్ని ఇస్తానని సాతాను చెప్పాడు. యేసు తన వాక్కులను వినియోగించాడు లేదా "శరీరదారి అయిన వాక్కు" శత్రువును వెనక్కి నెట్టడానికి దేవుని "లిఖిత పూర్వక వాక్కును" ఉపయోగించాడు.

దేవుడు మనలను ఎన్నడూ శోధించడు అయితే మనం శోధించబడడానికి ఆయన మనలను అనుమతిస్తాడు,తద్వారా మన విశ్వాసం యొక్క యథార్థత వెల్లడి అవుతుంది. మరియు మన నమ్మకాలు ఆయన వాక్యపు పునాదిపై ఆధారపడి ఉండేలా పరీక్షించబడటానికి ఆయన అనుమతిస్తాడు. ఆయన మాట మనకు తెలియకపోయిన యెడల శత్రువుతో మనం ఏవిధంగా పోరాడతాము?వాడి అబద్ధాలనూ మరియు మోసాలను మనం ఏవిధంగా నిర్మూలిస్తాము?దేవుని వాక్యం మన హృదయాలలో లోతుగా పాతుకొనిపొబడకుండా,మనం దుష్టత్వంతో మునిగిపోతాము మరియు మనం ఎవరి పక్షంగా ఉన్నామో మర్చిపోతాము. యేసు పాపం మరియు మరణాన్ని అధిగమించి అంతిమ విజయం సాధించాడు కాబట్టి మనం విజేతలు అని పిలువబడ్డాము. యేసులో మనం జయించేవారి కంటే ఎక్కువ వారిగా ఉన్నాము. శత్రువుల పన్నాగాలు,కుతంత్రాలపై విజయం సాధిస్తాం!

మిమ్ములను మీరు ప్రశ్నించుకోవలసిన ప్రశ్నలు:
శత్రువు నన్ను కీలుబొమ్మగా చేస్తున్నాడా?
నేను ఓడిపోయిన మనస్తత్వాన్ని కలిగి ఉన్నానా లేదా విజేత యొక్క మనస్తత్వాన్ని కలిగి ఉన్నానా?
శత్రువు సాతానుని అతనిని నిరాయుధునిగా చేయడానికి నేను ఏ గ్రంథం మీద దృష్టి పెట్టాలి మరియు ఉపయోగించాలి?

读经计划介绍

యేసుతో ముఖాముఖి

మనతోనూ, మనలోనూ తన నివాసాన్ని చేసుకొన్న మన నిత్యుడైన దేవుని గురించి పరిచితమైన సత్యాలతో మనలను మనం సేదదీర్చుకోడానికి శ్రమల కాలము ఒక గొప్ప సమయం. ఈ బైబిలు ప్రణాళిక ద్వారా, ఇది ఒక దిక్సూచిగా మిమ్ములను సంపూర్ణంగా పూర్తి నూతన స్థాయిలో యేసుతో సమయాన్ని అనుభవించుటకు నడిపించే దేవుని వాక్యముతో ఈ 40 రోజులూ ప్రతి దినం కొన్ని నిమిషాలు వెచ్చిస్తారు అని మా నిరీక్షణ.

More

相关题材的计划