యేసుతో ముఖాముఖి预览

యేసు మరియు ఆయన దూరపు బంధువు యోహాను పరిచర్యలో సమకాలీనులు మరియు వారిలో ఒకరికి ఈ ఇద్దరిలో ఎక్కువ పరిచర్య ఉంది. యేసు పరలోకానికి చెందినవాడని మరియు ఆయన పరలోకపు తండ్రి మాటలు మాట్లాడాడని యోహాను గుర్తించాడు. యోహాను భూమికి చెందినవాడు మరియు తనకు అప్పగించబడిన పరిచర్యను పూర్తి చేసాడు - యేసుకు ముందుగా వచ్చి,ఆయనను స్వీకరించడానికి మనుష్యుల హృదయాలను సిద్ధం చేయడం. అతని పరిచర్యలో పశ్చాత్తాపపడి,దేవుని రాజ్యాన్ని స్వీకరించాలని కోరుకునే వ్యక్తులకు బాప్తిస్మమివ్వడం ఉంది.
క్రీస్తు యొక్క ప్రతి అనుచరునికి బాప్తిస్మం చాలా ముఖ్యమైనది (యేసు బాప్తిస్మం పొందాలని ఎంచుకుంటే మనం దాని నుండి వైదొలగ లేము),మరింత ముఖ్యమైనది పశ్చాత్తాపం మరియు పునరుద్ధరణ యొక్క ఫలాలను ఫలించే జీవితాన్ని జీవించడం. మనం జీవించి ఉన్నంత కాలం పశ్చాత్తాపం కొనసాగుతూనే ఉండాలి,ఎందుకంటే మనం ఎప్పటికీ పరిపూర్ణంగా ఉండలేము. యేసులో మనం క్షమించబడి,ఆయన శక్తి నింపుదల ద్వారా ముందుకు సాగడానికి పునరుద్ధరించబడవచ్చు. పునరుద్ధరణ అనేది ప్రతిరోజు జరిగే విషయం,అక్కడ మనం మన జీవితాలను దేవునికి తిరిగి సమర్పించుకుంటాము,ఆయన శుద్ధి చేయడానికి,నింపడానికి మరియు మనలను సరిగా ఉంచేలా మనల్ని మనం సమర్పించుకొంటాము.
సరిపోయింది.
పశ్చాత్తాపం మరియు పునరుద్ధరణకు మనం సమర్పించుకొని ఉన్నప్పుడు,దేవుని రాజ్యంలో మన బాధ్యతను క్రమంగా కనుగొంటాము మరియు సాధ్యమైనంత పూర్తి సామర్థ్యాన్ని కలిగి జీవించగలము!
మిమ్ములను మీరు ప్రశ్నించుకోవలసిన ప్రశ్నలు:
నేను పశ్చాత్తాపపడాల్సిన అవసరం ఏదైనా ఉందా?
పునరుద్ధరణ ప్రక్రియకు నన్ను నేను పూర్తిగా సమర్పించుకోకుండా అడ్డుకోనేది ఏమిటి?
读经计划介绍

మనతోనూ, మనలోనూ తన నివాసాన్ని చేసుకొన్న మన నిత్యుడైన దేవుని గురించి పరిచితమైన సత్యాలతో మనలను మనం సేదదీర్చుకోడానికి శ్రమల కాలము ఒక గొప్ప సమయం. ఈ బైబిలు ప్రణాళిక ద్వారా, ఇది ఒక దిక్సూచిగా మిమ్ములను సంపూర్ణంగా పూర్తి నూతన స్థాయిలో యేసుతో సమయాన్ని అనుభవించుటకు నడిపించే దేవుని వాక్యముతో ఈ 40 రోజులూ ప్రతి దినం కొన్ని నిమిషాలు వెచ్చిస్తారు అని మా నిరీక్షణ.
More