యేసుతో ముఖాముఖి预览

యేసుతో ముఖాముఖి

40天中的第12天

యిర్మీయాకు "విలపించు ప్రవక్త" అనే మారుపేరు ఇవ్వబడింది. ఇది గొప్ప బిరుదు కాదు అయితే ఇది ఒక తీక్ష్ణమైనది,ఎందుకంటే అతడు తన పిలుపుకు ఎంతో సమర్పించుకొన్నాడు. మరియు దానిని అత్యంత శ్రద్ధతోనూ మరియు కరుణతోనూ ముందుకు కొనసాగించాడు. అతడు తన ప్రజల విషయంలో,వారి పాపాల విషయంలో మరియు వారు దేవునికి దూరంగా ఉన్న కారణంగా చాలా విచారించాడు. దేవుడు తాను అతని నోటి ఉంచే మాటలను మాట్లాడాలని దేవుడు అతనికి ఆజ్ఞాపించాడు. మరియు అతడు అతను విరిగిన మరియు పశ్చాత్తాపపడిన హృదయంతోనూ,శ్రద్ధగానూ దానిని చేశాడు. యిర్మీయా‘విలాప వాక్యముల’గ్రంథమును కూడా రాశాడు,ఇది ఒకే ఒక్క నిజమైన దేవునికి తన దుఃఖాన్ని మరియు విరిగిపోయిన హృదయానికి నివాళిగా ఉండే కవితల పుస్తకం.

దేవుణ్ణి ప్రేమించి,ఆయన కోసం జీవించే వారిగా మనం విలపించడం నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యం. విలపించడం అనేది ఫిర్యాదు చేయడం కాదు అయితే నీ సృష్టి కర్త ముందు బహిరంగంగా మరియు నిజాయితీగా దుఃఖించటానికి నీకు నీవే అనుమతి ఇచ్చుకోవడం. ఇది దేవుని సన్నిధిలో మిమ్మల్ని రద్దు చేసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది,తద్వారా మీ కోసం ఆయన కోరుకున్నదంతా మీరు పునర్నిర్మించబడవచ్చు

మిమ్ములను మీరు ప్రశ్నించుకోవలసిన ప్రశ్నలు:
నా జీవితంలో పరిష్కరించబడని దుఃఖం ఉందా?
భరించగల నా శక్తికి మించి నన్ను భారభారితం చెస్తున్నవి ఏమైనా ఉన్నాయా?
నా భద్రతను దేవుని వద్ద ఉంచగలనా మరియు ఆయన యెదుట నేను విలపించగలనా?

读经计划介绍

యేసుతో ముఖాముఖి

మనతోనూ, మనలోనూ తన నివాసాన్ని చేసుకొన్న మన నిత్యుడైన దేవుని గురించి పరిచితమైన సత్యాలతో మనలను మనం సేదదీర్చుకోడానికి శ్రమల కాలము ఒక గొప్ప సమయం. ఈ బైబిలు ప్రణాళిక ద్వారా, ఇది ఒక దిక్సూచిగా మిమ్ములను సంపూర్ణంగా పూర్తి నూతన స్థాయిలో యేసుతో సమయాన్ని అనుభవించుటకు నడిపించే దేవుని వాక్యముతో ఈ 40 రోజులూ ప్రతి దినం కొన్ని నిమిషాలు వెచ్చిస్తారు అని మా నిరీక్షణ.

More