యేసుతో ముఖాముఖి预览

యేసుతో ముఖాముఖి

40天中的第11天

దేవుడు యెహెజ్కేలును ఇశ్రాయేలుకు కావలివానిగా పిలిచాడు,జరగబోయే సంగతులను అతడు చూస్తాడు. మరియు దానిని ప్రజలకు నమ్మకంగా అందిస్తాడు. ఈ పని కష్టంగా ఉంటుంది,మీ స్వంత వ్యక్తులతో మాట్లాడటం బెదిరింపుగా ఉంటుంది మరియు వారు అవిధేయులుగానూ మరియు విగ్రహారాదికులుగానూ ఉన్నప్పుడు అది మరింత క్లిష్టంగా మారుతుంది. అయినప్పటికీ,దేవుని ప్రజలకు మంచి వార్తలనూ,మరియు చెడు వార్తలనూ తెలియజేయడంలో యెహెజ్కేలు నిగ్రహంతో ఉన్నాడు.

ఈ గ్రంథంలో పునరావృతమయ్యే అంశం దేవుని మహిమ. ఇశ్రాయేలు ప్రజలను శత్రు దేశాలు బందీలుగా తీసుకున్నప్పుడు,ఇశ్రాయేలు దేశముగా దాని మహిమ కనుమరుగైంది లేదా మరుగైందని వారు భావించారు. దేవుడు తానే ఇశ్రాయేలు మహిమ అని తన ప్రవక్తల ద్వారా బయలుపరచాడు. చెరలో ఉండడం,శ్రమలు మరియు నష్టాల యొక్క కష్టతరమైన పరిస్థితులలో కూడా,దేవుడు వారితో ఉన్నాడు. ఆయన వారిని ఎప్పుడూ వదిలి వెళ్ళలేదు. తన ప్రజలు తన నుండి దూరం అవుతున్నందుకు ఆయన బాధపడ్డాడు మరియు ఆయన తన గొప్ప ప్రేమతో వారిని క్రమశిక్షణలో ఉంచాడు. దేవుని మహిమ భూమిని నింపుతూనే ఉంటుంది మరియు ఆయనను ప్రేమించి ఆయనను అనుసరించే వారి మీద ఆయన మహిమ మనపై ఉంటుంది. ప్రాణం యొక్క అత్యంత చీకటి కాలాల్లో కూడా,మనం మనస్ఫూర్తిగా ఆయనను ప్రేమించటానికి సమర్పించుకొని ఉన్నట్లయితే,మన జీవితాలలో ఆయన మహిమ తగ్గిపోదు.

మిమ్ములను మీరు ప్రశ్నించుకోవలసిన ప్రశ్నలు:
ప్రకృతిలోనూ మరియు నా చుట్టూ ఉన్న దేవుని మహిమను నేను చూడగలుగుతున్నానా?
ఈ సంవత్సరం నా జీవితంలో దేవుని మహిమ ఎక్కడ స్పష్టంగా కనిపించింది?

读经计划介绍

యేసుతో ముఖాముఖి

మనతోనూ, మనలోనూ తన నివాసాన్ని చేసుకొన్న మన నిత్యుడైన దేవుని గురించి పరిచితమైన సత్యాలతో మనలను మనం సేదదీర్చుకోడానికి శ్రమల కాలము ఒక గొప్ప సమయం. ఈ బైబిలు ప్రణాళిక ద్వారా, ఇది ఒక దిక్సూచిగా మిమ్ములను సంపూర్ణంగా పూర్తి నూతన స్థాయిలో యేసుతో సమయాన్ని అనుభవించుటకు నడిపించే దేవుని వాక్యముతో ఈ 40 రోజులూ ప్రతి దినం కొన్ని నిమిషాలు వెచ్చిస్తారు అని మా నిరీక్షణ.

More