యేసుతో ముఖాముఖి预览

యేసుతో ముఖాముఖి

40天中的第10天

ఏలియా గొప్పవారిలో ఒక ప్రముఖుడు. అతడ ఒక యమ్.వి.పి. (MVP-అత్యంత విలువైన ప్రవక్త). అతడు నీచమైన,అత్యంత దుర్మార్గపు పాలకులలో ఒక జంటకు వ్యతిరేకంగా నిలబడ్డాడు,వారి ద్వంద్వ విధానాన్ని సవాలు చేశాడు. అతడు కఠినమైన మనుష్యులతో దేవుని సత్యాన్ని మాట్లాడాడు మరియు వారు వినకుండా వెళ్ళినప్పుడు కూడా తాను తన స్థానంలో నిలిచాడు.

అతడు తన పై రూపాన్ని బట్టి కఠినమైనవాడిగా మరియు దృఢమైన వాడిగా ఉన్నాడు,అయితే అతడు విడిచిపెట్టాడు,అతడు కర్మెలు పర్వతం మీద బయలు ప్రవక్తలపై గెలిచిన విజయంతో,అతను ఉత్తేజితుడుగా మరియు మరిన్ని గొప్ప కార్యాలు చేయడానికి ప్రేరేపించబడి ఉండాలి. విచారకరంగా రాణి యెజబెలు ఇచ్చిన మరణ బెదిరింపుల గురించి విన్నప్పుడు అతను చాలా నిరాశ చెందాడు మరియు అజ్ఞాతంలోనికి వెళ్ళిపోయాడు. అతడు పరిగెత్తి దాగుకోవాలని దేవుడు ఎన్నడూ అడగలేదు అయితే అతడు ఆ విధంగా ఎంచుకున్నాడు,అయితే దేవుడు అతని నాశనాన్ని మరియు చీకటి మనస్తత్వాన్ని అడ్డుకున్నాడు. ఎడారులలో రెండు సార్లు సుదీర్ఘ నిద్రను కలిగియున్న తరువాత,ఆ సమయంలో అతనికి ఒక దేవదూత ఆహారం అందించాడు,తరువాత ఆపై ప్రభువు పర్వతమైన హోరేబు పర్వతానికి నలభై రోజుల ప్రయాణం చేయమని కోరాడు. దేవుడు అక్కడ అతనిని కలుసుకున్నాడు మరియు అతనికి హెచ్చరికలను నెమ్మదిగా చెప్పాడు.

ఏలియా దగ్గర ఒక రాత ప్రతి ఉంది,తాను అక్కడ ఏమి చేస్తున్నాడని అడిగిన వానికి అతడు తిరిగి తిరిగి వివరిస్తూ వచ్చాడు. దేవుడు అతని యదార్ధమైన దుఃఖానికి మరియు స్వీయ జాలి విషయంలో పునరుద్ధరించబడిన దర్శనంతోనూ మరియు స్పష్టపరచిన ఉద్దేశ్యంతోనూ ప్రతిస్పందించాడు. ఇద్దరు రాజులు మరియు ఒక ప్రవక్తను అభిషేకించడానికి ఏలియా తిరిగి పంపబడ్డాడు,అయితే అక్కడ బయలుకు నమస్కరించని శేషించిన ఒక గుంపు ఉందని అతనికి వెల్లడిచెయ్యబడింది. ముఖ్యంగా ఏలీయా నిరీక్షించడానికీ,మరియు విడిచిపెట్టకుండా ఉండటానికి దేవుడు ఒక కారణాన్ని ఇచ్చాడు.

మిమ్ములను మీరు ప్రశ్నించుకోవలసిన ప్రశ్నలు:
నా జీవితం ఈ విధంగా మారిందని నేను నిరుత్సాహపడుతున్నానా?
నేను విడిచి పెట్టాలనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
నన్ను కొనసాగించేది ఏమిటి?

读经计划介绍

యేసుతో ముఖాముఖి

మనతోనూ, మనలోనూ తన నివాసాన్ని చేసుకొన్న మన నిత్యుడైన దేవుని గురించి పరిచితమైన సత్యాలతో మనలను మనం సేదదీర్చుకోడానికి శ్రమల కాలము ఒక గొప్ప సమయం. ఈ బైబిలు ప్రణాళిక ద్వారా, ఇది ఒక దిక్సూచిగా మిమ్ములను సంపూర్ణంగా పూర్తి నూతన స్థాయిలో యేసుతో సమయాన్ని అనుభవించుటకు నడిపించే దేవుని వాక్యముతో ఈ 40 రోజులూ ప్రతి దినం కొన్ని నిమిషాలు వెచ్చిస్తారు అని మా నిరీక్షణ.

More

相关题材的计划