30 రోజుల్లో కీర్తన గ్రంధంనమూనా

30 రోజుల్లో కీర్తన గ్రంధం

30 యొక్క 26

నీతి అను బహుమానం పొందుకోవడం

వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును తన రక్షకుడైన దేవునివలన నీతిమత్వము నొందును.(కీర్తన :24:5)

నీతి అనేది దేవుడిచ్చిన బహుమతి అని పై వచనం చెబుతుంది, అది కొంచెం భిన్నంగా అనిపిస్తుంది.
మన నీతి దేవునికి ఒక బహుమానంగా ఉండాలని ఆశిస్తాము ఆయన ఆశీర్వాదం పొందడానికి అవసరం. చదివితే నీతి మరియు ఆశీర్వాదం రెండు ఆయనకు ఇవ్వబడ్డాయి ఎవరు ఆ వ్యక్తి ?

నిర్దోషమైన చేతులును శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే.(కీర్తన :24:4)అలాంటి వ్యక్తి దేవుని చిత్తానికి లోబడటానికి మరియు ఇతరులతో న్యాయంగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తాడు.వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులును శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే.(కీర్తన :24:4) మీరు అలాంటివారేనా?

మనం నిజంగా మనతో నిజాయితీగా ఉంటే, మనం ఎంత ప్రయత్నించినా, దేవుని స్థాయిని పూర్తిగా చేరలేము . మన “నీతి” లోపిస్తుంది. యెషయా 64:6 లో చూసినట్టు మా నీతిక్రియలన్నియు మురికిగుడ్డవలె నాయెను కానీ నిరాశ చెందాల్సిన అవసరం లేదు .మన స్థానంలో యేసు సంపాదించాడు. మరియు దేవుడు మనకు ఉచితంగా “సమృద్ధిగా కృపను మరియు నీతి అందిస్తున్నాడు. (రోమా 5:17 ). ఆయనను మన ప్రభువుగా మరియు రక్షకుడిగా అంగీకరించడం ద్వారా, మనం పొందగలం అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై, నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది.(రోమా 3:22 )

మీరు నీతి అను అహుమతిని అంగీకరిస్తారా ?

వాక్యము

ఈ ప్రణాళిక గురించి

30 రోజుల్లో కీర్తన గ్రంధం

"కీర్తనల గ్రంధం లో 150 పద్యాలు మరియు కీర్తనలు ఉన్నాయి.దేవునిపై నమ్మకం తో ఉండే ప్రజల బాధ, భయం, ఆనందం మరియు ఆశ ను వ్యక్త పరుస్తాయి ఈ 30 రోజుల ధ్యానం లో శతాబ్దాల నాటి ఈ పదాలు మీ స్వంత భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి, కొత్త ఆశను కనుగొనడానికి మరియు మీ విశ్వాసంలో బలపడటానికి ఎలా సహాయపడతాయో తెలుసుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. "

More

ఈ ప్రణాళికను అందించినందుకు GlobalRize కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: www.globalrize.org