30 రోజుల్లో కీర్తన గ్రంధంనమూనా

30 రోజుల్లో కీర్తన గ్రంధం

30 యొక్క 24

మీ సాక్ష్యాన్ని పంచుకొనుట

నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను సమాజమధ్యమున నిన్ను స్తుతించెదను. (కీర్తన :22:22)

దావీదు దేవుడు తనను ఎలా రక్షించాడో అనుభవం పొంది యున్నాడు అతడు నిరాశ కలిగిన స్థితి లో ఉన్నాడు కాని దేవుడు తనను శతువుల చేతిలో నుండి రక్షించాడు ! దావీదు ఈ విషయాన్ని తన లోనే దాచుకోకుండా అందరితో పంచుకున్నాడు.

దీనికి బలమైన ఉద్దేశ్యం ఉంది దేవునికి తగిన స్తుతి చెల్లుతుంది మరియు వారు ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, దావీదు కథ ద్వారా ఇతరులు ప్రోత్సహించబడతారు ఈ కీర్తనలో తెలిచేయబడిన దేవుని రక్షణను గుర్తు చేసుకుంటారు ఇది వారికి దేవుడు తమను కూడా రక్షించగలడు అనే కొత్త ఆశను కలుగచేస్తుంది దావీదు కూడా ఆశను వ్యక్త పరుస్తాడు భూదిగంతముల నివాసులందరు జ్ఞాపకము చేసికొని యెహోవాతట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరు నీ సన్నిధిని నమస్కారము చేసెదరు. (కీర్తన :22:27)

ఈ కీర్తన ధ్యానిస్తున్నప్పుడు మనము కూడా ఈ సంఘములో భాగస్థులమే దేవుడు దావీదు కు ఏ విధంగా సహాయం చేసాడో చదుతాము మరియు మన సొంత కష్టాల్లో దేవుని పై ఆధారపడటం నేర్చుకున్నాము దావీదు రాసిన కీర్తన నుండి ఇప్పటి వరకు దేవుడు మారలేదు మనం ఆయనను ప్రార్థించినప్పుడు ఆయన ఇప్పటికీ మనలను రక్షించాలని సిద్ధంగా ఉన్నాడు.మీరు దేవుని రక్షణను అనుభవించినప్పుడు, దానిని ఇతరులతో పంచుకోండి.దేవుడు మీకు చేసిన కార్యం గురించి వారికి చెప్పండి దీని ద్వారా దేవునికి స్తుతి ఘనతలు కలుగుతాయి మరియు మీ సాక్ష్యం ద్వారా తోటి విశ్వాసులు కూడా ప్రోత్సహించబడతారు.

ఈ ప్రణాళిక గురించి

30 రోజుల్లో కీర్తన గ్రంధం

"కీర్తనల గ్రంధం లో 150 పద్యాలు మరియు కీర్తనలు ఉన్నాయి.దేవునిపై నమ్మకం తో ఉండే ప్రజల బాధ, భయం, ఆనందం మరియు ఆశ ను వ్యక్త పరుస్తాయి ఈ 30 రోజుల ధ్యానం లో శతాబ్దాల నాటి ఈ పదాలు మీ స్వంత భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి, కొత్త ఆశను కనుగొనడానికి మరియు మీ విశ్వాసంలో బలపడటానికి ఎలా సహాయపడతాయో తెలుసుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. "

More

ఈ ప్రణాళికను అందించినందుకు GlobalRize కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: www.globalrize.org