30 రోజుల్లో కీర్తన గ్రంధంనమూనా

30 రోజుల్లో కీర్తన గ్రంధం

30 యొక్క 22

విరోధులునీ హస్తము నీ శత్రువులందరిని చిక్కించుకొనును నీ దక్షిణహస్తము నిన్ను ద్వేషించువారిని చిక్కించుకొనును.(కీర్తన :21:8)

ఇది నిజంగా ఎవరు నియంత్రణలో ఉన్నారో, ఎవరు అన్ని ప్రశంసలు మరియు గౌరవాలకు అర్హులో మనకు చూపిస్తుంది. విరోధులు మన మానవులకే కాదు ఇక్కడ మనము దేవుని కి కూడా విరోధులను చూస్తాము ఆయనకు వ్యతిరేకంగా చెడు ఆలోచించే వారు ఉన్నారు.వారు దేవుడిని తమ సృష్టికర్తగా మరియు ప్రభువుగా అంగీకరించరు, కానీ దుష్కార్యాలను చేస్తారు .అది నిజంగా ప్రమాదకరం - దేవునికి కాదు, ఆలా అనుకునే వారికి కూడా ప్రభువు కరుణామయుడు, కోపానికి నిదానుడు,కానీ ఆయన దోషులను నిర్దోషులుగా ప్రకటించడు. ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు కార్యాలు చేస్తూనే ఉంటే, ఆయన వారిని శిక్షిస్తాడు.నేటి కీర్తన యుద్ధభూమి నుండి ఊహ చిత్రాలను ఉపయోగిస్తుంది:

"నీవు వారిని వెనుకకు త్రిప్పివేసెదవు నీ వింటి నారులను బిగించి వారిని ముఖము మీదకొట్టుదువు."(కీర్తన :21:12)

దాని ముందు వచనం చూస్తే" ..... నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండమువలె అగుదురు తన కోపమువలన యెహోవా వారిని నిర్మూలముచేయును అగ్ని వారిని దహించును." (కీర్తన :21:9) దేవునితో యుద్ధం చేసే ప్రతి ఒక్కరికీ ఇది తీవ్రమైన హెచ్చరిక.మీరు ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి ప్రయత్నిస్తే, దానికి మీరు మూల్యం చెల్లించుకుంటారు. మరియు ఇంకోవైపు మీరు దేవుని కుటుంబానికి చెందినవారైతే, ఆయన ఉగ్రత యొక్క ఈ సందేశం మిమ్మల్ని ఓదార్చగలదు. దేవునికి ఎందరు దేవునికి విరోధులుగా లేచినను ఆఖరిగా వారు విజయం పొందలేరు .ఆయన సమస్త చెడును తీసివేస్తాడు మరియు భూమి నీతితో నింపుతాడు.

మరి మీరు ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారా ?

వాక్యము

ఈ ప్రణాళిక గురించి

30 రోజుల్లో కీర్తన గ్రంధం

"కీర్తనల గ్రంధం లో 150 పద్యాలు మరియు కీర్తనలు ఉన్నాయి.దేవునిపై నమ్మకం తో ఉండే ప్రజల బాధ, భయం, ఆనందం మరియు ఆశ ను వ్యక్త పరుస్తాయి ఈ 30 రోజుల ధ్యానం లో శతాబ్దాల నాటి ఈ పదాలు మీ స్వంత భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి, కొత్త ఆశను కనుగొనడానికి మరియు మీ విశ్వాసంలో బలపడటానికి ఎలా సహాయపడతాయో తెలుసుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. "

More

ఈ ప్రణాళికను అందించినందుకు GlobalRize కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: www.globalrize.org