30 రోజుల్లో కీర్తన గ్రంధంనమూనా

పశ్చాత్తాపం, క్షమాపణ మరియు పరిశుద్ధత
యెహోవా, నా పాపము బహు ఘోరమైనది నీ నామమునుబట్టి దానిని క్షమింపుము. యెహోవాయందు భయభక్తులుగలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును.(కీర్తన:25:11-12)
నేటి కీర్తన .ప్రభువు మరియు ఆయనను విశ్వసించే వ్యక్తుల మధ్య సంబంధంలో కీలకమైన రెండు అంశాలను ప్రస్తావిస్తుంది
మొదటి అంశం దేవుణ్ణి విశ్వసించే వారు ఆయన క్షమాపణ కోరుకుంటారు మనం దేవుని బిడ్డలైనప్పుడు ఒక్కసారి మాత్రమే చేయవలసిన పని కాదు.ఇది మళ్ళి మళ్ళి మనం పాపం లో పడిపోతూనే ఉంటాం మనం పాపమును ఒప్పుకొని ఆయనను క్షమాపణ అడగాలి
పశ్చాతాపం ఎంత అవసరమో దేవుడు క్షమిస్తాడనే నమ్మకం ఈ రెండింటి గురించి అపోస్తులుడైన యోహాను చాల స్పష్టంగా వివరించాడు". మనము పాపములేనివారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్యముండదు మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును." (1 యోహాను :1:8-9)
రెండవ అంశం 25వ కీర్తనలో ప్రత్యేకంగా కనిపించే , విశ్వాసులు కూడా జీవితానికి సంబంధించిన దేవుని సూచనలను స్వీకరించి వాటిని పాటిస్తారు.మనం పాపులమే అయినప్పటికీ, ఆయనను సంతోషపెట్టే ల జీవితాన్ని గడపాలనేది మన కోరిక.దేవుని చిత్తాన్ని నేర్చుకుని, విధేయత చూపడానికి ప్రయత్నించే ఈ ప్రక్రియను "పవిత్రపరుచుకోవటం " అంటారు, పరిశుద్ధతలేకుండ లేకుండా ఎవరూ ప్రభువును చూడలేరు"(హెబ్రీయులు 12:14 ). ప్రభువు మన హృదయాలను నూతన పరుస్తాడు కాబట్టి మనం మరింత ఎక్కువగా ఆయనను పోలి ఉంటాము మరియు మన పాపపు కోరికలు మాయమవుతాయి.
మీ సొంత జీవితంలో ఈ రెండు అంశాలను మీరు గుర్తించారా?
వాక్యము
ఈ ప్రణాళిక గురించి

"కీర్తనల గ్రంధం లో 150 పద్యాలు మరియు కీర్తనలు ఉన్నాయి.దేవునిపై నమ్మకం తో ఉండే ప్రజల బాధ, భయం, ఆనందం మరియు ఆశ ను వ్యక్త పరుస్తాయి ఈ 30 రోజుల ధ్యానం లో శతాబ్దాల నాటి ఈ పదాలు మీ స్వంత భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి, కొత్త ఆశను కనుగొనడానికి మరియు మీ విశ్వాసంలో బలపడటానికి ఎలా సహాయపడతాయో తెలుసుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. "
More
ఈ ప్రణాళికను అందించినందుకు GlobalRize కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: www.globalrize.org
సంబంధిత ప్లాన్లు

అద్భుతాల 30 రోజులు

నన్ను ఆజ్ఞాపించు – జీరో కాన్ఫరెన్స్

గ్రేస్ గీతం

దేవుని కవచం - అపొస్తలుల చర్యలు

ఈస్టర్ అనేది క్రాస్ - 4 రోజుల వీడియో ప్రణాళిక

హింసలో భయాన్ని ఎదిరించుట
క్రిస్మస్ హృదయంలో ఉంది - 7 రోజుల వీడియో ప్లాన్

30 రోజుల్లో కీర్తన గ్రంధం
