30 రోజుల్లో కీర్తన గ్రంధంనమూనా

30 రోజుల్లో కీర్తన గ్రంధం

30 యొక్క 28

దేవుని కి నీ హృదయాన్ని తెరువు

యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. (కీర్తన :26:2)

దేవునికి మన హృదయం బాగా తెలుసు ఇది దావీదుకి కలవరపడే విషయం కాదు అతను దాచడానికి ఎం లేదు అతను యథార్థతతో నడుస్తు ప్రభువును విశ్వసిస్తున్నాడని అతనికి తెలుసు.తనను పరీక్షించి పరిశోధించమని అతను దేవుడిని స్పష్టంగా అడుగుతాడు. బాహ్యంగానే కాదు హృదయమును కూడా దావీదుకు దేవుని దగ్గర ఏం రహస్యాలు లేవు దీని అర్ధం అతనికి దేవుని సహాయం అవసరం లేదని లేక దావీదు పరిపూర్ణతతో ఉన్నాడు అని కాదు అతని జీవితం నియంత్రణలో ఉందని లేక దేవుడు తనని పాపరహితుడిగా ఎంచుతున్నాడు అని ప్రస్తావించడు దీనికి వ్యతిరేకంగా ఈ కీర్తన లో ఇలా అడుగుతాడు నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము (కీర్తన :26:11)దావీదుకు తెలుసు దేవునితో నడవాలంటే అయన కృప పొందుకోవడం మాత్రమే మార్గం అని అంటే తన జీవితమంతా ఆయనకు అంకితం చేయడం. అని దావీదు సంతోషంగా అలా చేస్తాడు

మీరు మీ హృదయాన్ని దేవునికి తెరుస్తారా ?మిమ్మల్ని పరిశోధించి సరిచేయమని ఆహ్వానిస్తారా ?లేక ఇంకా మీ హృదయం చీకట్లో ఉందా దీన్ని బట్టి దేవుని నుండి .దాచాలని అనుకుంటున్నారా?

వాక్యము

ఈ ప్రణాళిక గురించి

30 రోజుల్లో కీర్తన గ్రంధం

"కీర్తనల గ్రంధం లో 150 పద్యాలు మరియు కీర్తనలు ఉన్నాయి.దేవునిపై నమ్మకం తో ఉండే ప్రజల బాధ, భయం, ఆనందం మరియు ఆశ ను వ్యక్త పరుస్తాయి ఈ 30 రోజుల ధ్యానం లో శతాబ్దాల నాటి ఈ పదాలు మీ స్వంత భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి, కొత్త ఆశను కనుగొనడానికి మరియు మీ విశ్వాసంలో బలపడటానికి ఎలా సహాయపడతాయో తెలుసుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. "

More

ఈ ప్రణాళికను అందించినందుకు GlobalRize కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: www.globalrize.org