మీ జీవితంలో అతి పెద్ద నిర్ణయం!Sample

“నీటి బాప్తిస్మము: మార్పు చెందిన జీవితము యొక్క బహిరంగ ప్రకటన”
మీ రక్షణ గురించి బహిరంగముగా ప్రకటించుటకు నీటి బాప్తిస్మము అనేది ఒక ప్రాముఖ్యమైన మార్గము. నీటి బాప్తిస్మము మీ పాత జీవితము అంతమై క్రొత్త జీవితం ప్రారంభమైందనే ఒక వేడుక. యేసు పునరుత్థానం తరువాత ఆరోహణమవ్వక ముందు తన శిష్యులకు నీటి బాప్తిస్మము యొక్క ప్రాముఖ్యతను బోధించాడు. ఆయన ఇలా చెప్పాడు.
“కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు.” మత్తయి 28:19
క్రొత్త నిబంధన అంతటిలో, విశ్వాసులు బాప్తిస్మము పొందిన అనేకమైన సంఘటనలు మనకు కనిపిస్తాయి. బాప్తిస్మము అనేది దానిని పొందుతున్న వారికి మరియు చూస్తున్నవారికి ఒక ప్రాముఖ్యమైన ప్రతీకగా ఉంటుంది. నీటి బాప్తిస్మము బహిరంగముగా ఇలా తెలుపుతుంది: నీటిలోనికి ముంచబడుట ద్వారా మీ గత జీవితం ముగిసిపోయింది; కడుగబడి, పవిత్రపరచబడి నీటిలో నుండి బయటికి వచ్చుట ద్వారా క్రీస్తులో మీ నూతన జీవితం ప్రారంభమయ్యింది.
లూకా 3:3 నీటి బాప్తిస్మమును “పశ్చాత్తాప బాప్తిస్మము” అని పిలుస్తుంది మరియు మీరు మీ గత జీవితము నుండి మరియు పాపము నుండి తిరిగిపోయారని బహిరంగముగా ప్రకటించుట యొక్క ప్రాముఖ్యతను తెలుపుతుంది. నీటి బాప్తిస్మము మనలను రక్షించలేదు లేదా మన పాపమును కప్పలేదు కానీ అది మన క్రైస్తవ జీవితంలోని ఒక క్లిష్టమైన భాగమును సూచిస్తుంది- మీరు మార్పు చెందిన జీవితము కలిగి నూతన సృష్టిగా ఉన్నారనే ప్రకటన! ఇటువంటి ప్రకటన చేయనవసరం లేని వారు ఎవరైనా ఉన్నారంటే అది యేసు క్రీస్తు మాత్రమే. ఆయన భూమి పైన పాపరహితమైన జీవితాన్ని జీవించాడు. కానీ లూకా 3:21 చెబుతుంది,
“ప్రజలందరును బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడ బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి.” లూకా 3:21
మనం యేసు మాదిరిని అనుసరించటానికి ఆయన బాప్తిస్మము పొందాడు. నీటి బాప్తిస్మము యొక్క ప్రాముఖ్యత ఎంత చెప్పినా చాలదు. మీరు ఇప్పటికే నీటి బాప్తిస్మము పొందియుండకపోతే, మీరు నీటి బాప్తిస్మము పొందుటను అత్యంత ప్రాధాన్యతగా ఎంచుకోవాలి. మన రక్షణ గూర్చిన బహిరంగ ప్రకటన చేయాలని బైబిలు బోధిస్తుంది మరియు దాదాపు బైబిల్ నమ్మే సంఘాలన్నీ నీటి బాప్తిస్మము పొందటానికి అనేకమైన అవకాశాలు కలిగిస్తుంటాయి. యేసు మాదిరి అనుకరించడం ఎన్నటికైనా మంచిదే. మీ నమ్మకత్వం మరియఉ ఆయన పట్ల విధేయతను బట్టి దేవుడు మిమ్మును బాహుగా ఆశీర్వదించి ప్రతిఫలం అనుగ్రహిస్తాడు!
Scripture
About this Plan

మన జీవితంలో తీసుకునే అత్యధికమైన నిర్ణయాలు ఏదో ఒక విషయంలో ప్రాముఖ్యమైనవిగా ఉంటాయి. కానీ, అన్నింటికంటే ప్రాముఖ్యమైనది ఒక్కటే ఉంటుంది. దేవుని ఉచిత వరమైన రక్షణ అనే ఈ అత్యద్భుతమైన నిర్ణయాన్ని మరింత లోతుగా అర్థం చేసుకొనటానికి అవసరమైన ఒక సులభమైన మార్గదర్శి కోసం మీరు వెదుకుతుంటే, ఇక్కడ మొదలుపెట్టండి. డేవిడ్ స్వాండ్ రచించిన “ఈ లోకంలోనుండి: ఎదుగుదల మరియు ఉద్దేశమునకు క్రైస్తవుని మార్గనిర్దేశం” అనే పుస్తకంలోనుండి సంగ్రహించబడింది.
More
Related Plans

40 Rockets Tips - Workplace Evangelism (6-10)

21 Days of Fasting and Prayer - Heaven Come Down

Growing Your Faith: A Beginner's Journey

Breaking Free From Shame

God's Right Here

To You, Oh Lord

The Artist's Identity: Rooted and Secure

Conversation Starters - Film + Faith - Redemption, Revenge & Justice

Living by Faith: A Study Into Romans
