యేసుతో ముఖాముఖిSample

నోవహు దేవునితో వాడుకైన సహవాసంలో నడిచిన ఒక మనుష్యుడు. దుష్టత్వం ప్రబలముగానూ,చెడుతనం విస్తారంగా ఊగిసలాడుచున్న కాలంలో (ఈ కాలము వలే) అతడు నీతిమంతుడుగానూ,నిందారహితుడుగానూ ఉన్నాడు. ప్రచండమైన నాశనాన్ని తీసుకొని వచ్చిన జలప్రళయం తరువాత భూమిని ప్రత్యేకపరచడానికి,దానిని రక్షించడానికి మరియు తిరిగి మనుష్యులతో నింపడానికి దేవుడు అనేకులైన మనుష్యుల నుండి దేవుడు నోవహును ఎంచుకున్నాడు. ఇది సాధారణమైన పిలుపు కాదు- ఇది పూర్తిగా వర్ణించలేనిది.
దేవుని గురించిన భావన లేని మనుష్యుల దృష్టిలో నగరం మధ్యలో ఒక భారీ ఓడ భవనాలను ఊహించుకోండి. అతడు ఖచ్చితంగా చుట్టుపక్కల వారిచే ఎగతాళి చెయ్యబడి ఉంటాడు మరియు అపహాస్యమునకు గురై ఉంటాడు. అయినప్పటికీ నోవహు తనతో మాట్లాడిన దేవుని విషయంలో నమ్మకంగా ఉన్నాడు. అతడు ప్రతీ ఆజ్ఞలో చివరి అక్షరం వరకూ లోబడ్డాడు. తన భార్య మరియు కుమారుల కుటుంబాలతో పాటు ప్రతి జీవి యొక్క 2 జతలతో పాటు రక్షించబడ్డారు. యెంత గొప్ప సాహసం! ఒక వ్యక్తి మరియు అతని కుటుంబం ఇంత గొప్ప కార్యాన్ని చేపట్టడం ఎంత సాహసోపేతమైన కష్టమైనపని! అయినప్పటికీ వారు చేసారు మరియు దానికి బదులుగా దేవుడు నోవహుకు వాగ్దానం చేసాడు,ఆయన భూమిని జలప్రళయం ద్వారా ఇక మీదట నాశనం చేయడు.
నోవహు వలె మనలో ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద ఒక నిర్దిష్ట ఉద్దేశం కోసం దేవుని చేత సృష్టించబడ్డాము మరియు పిలువబడినాము. మనం మనం నోవహు చేసినట్లుగా సంపూర్తి విధేయతతో ఆయన పిలుపు వినడం,దానికి ప్రతిస్పందించడం దేవుని ఉన్నతమైన ప్రభావానికి మనల్ని మనం ఐక్యపరచుకోవడం మీద ఆధారపడి ఉంటుంది,
మిమ్ములను మీరు ప్రశ్నించుకోవలసిన ప్రశ్నలు:
ఇటీవల కాలంలో దేవుడు మీతో ఏమి మాట్లాడాడు?
మీరు ఆయన ఆజ్ఞలకు విధేయత చూపారా?
దేవునితో వాడుకైన సహవాసంలో నడవడానికి మీరు ఒక ఉద్దేశ పూర్వక ఎంపికను చేస్తారా?
Scripture
About this Plan

మనతోనూ, మనలోనూ తన నివాసాన్ని చేసుకొన్న మన నిత్యుడైన దేవుని గురించి పరిచితమైన సత్యాలతో మనలను మనం సేదదీర్చుకోడానికి శ్రమల కాలము ఒక గొప్ప సమయం. ఈ బైబిలు ప్రణాళిక ద్వారా, ఇది ఒక దిక్సూచిగా మిమ్ములను సంపూర్ణంగా పూర్తి నూతన స్థాయిలో యేసుతో సమయాన్ని అనుభవించుటకు నడిపించే దేవుని వాక్యముతో ఈ 40 రోజులూ ప్రతి దినం కొన్ని నిమిషాలు వెచ్చిస్తారు అని మా నిరీక్షణ.
More
Related Plans

Prayer Altars: Embracing the Priestly Call to Prayer

One Chapter a Day: Matthew

Moses: A Journey of Faith and Freedom

Faith-Driven Impact Investor: What the Bible Says

Horizon Church August Bible Reading Plan: Prayer & Fasting

Journey Through Genesis 12-50

Walk With God: 3 Days of Pilgrimage

Psalms of Lament

The Way of the Wise
