YouVersion Logo
Search Icon

యేసుతో ముఖాముఖిSample

యేసుతో ముఖాముఖి

DAY 20 OF 40

యాయీరు ఒక సమాజ మందిర పాలకుడు,అయితేదాని కంటే ముఖ్యమైన హోదా అతని అద్భుతమైన విశ్వాసం. అతడు తన కుమార్తె చనిపోయిన తరువాత యేసు వద్దకు వచ్చాడు, ఆమె బ్రతకడానికి ఆమె మీద తన చేతులు వేయమని యేసును అడిగాడు. అది అసాధారణం కాదా?తమబిడ్డను మృతులలో నుండి లేపమని ఎవరైనా అడగడం అంటే అతను యేసు యొక్క సాక్ష్యాన్ని అంతగా విశ్వసించాడని మరియు అతనిపై తన గౌరవాన్ని పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థం. యేసు చాలా గొప్ప విషయం కోసం అడిగాడనే ఆనందంతో యేసు అతనితో వెళ్లాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. యేసు తన ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు, "అమ్మాయి చనిపోలేదు,నిద్రపోతోంది" కాబట్టి దుఃఖిస్తున్నవారిని మరియు గుంపును బయటికి వెళ్లిపొమ్మని అక్షరాలా కోరాడు. శరీరంలో ఉన్న దేవుడు అక్కడే ఉన్నాడు. చనిపోయినట్లు అనిపించే పరిస్థితిలో దేవుడు మాత్రమే జీవాన్ని చూడగలడు.

మీ జీవితం లేదా ఏదైనా ఒక పరిస్థితి లేదా సంబంధం మృతమై పోడానికి సమీపంగా ఉన్నట్లు అనిపించినట్లయితే,బహుశా మీరు జీవాన్ని అనుగ్రహించే వ్యక్తిని దానిలోకి తీసుకురావలసిన సమయం, తద్వారా నిస్సహాయ మరియు చనిపోయిన పరిస్థితిలో ఆయన తాజాదనాన్ని మరియు శక్తిని వాటిలోనికి విడుదల చేస్తాడు.

మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవలసిన ప్రశ్నలు:
నా జీవితంలో ఏ ప్రాంతం ముఖ్యంగా నిర్జీవంగా ఉంది?
నేను ఈ రోజు ఉద్దేశపూర్వకంగా ఆ ప్రదేశంలోనికి క్రీస్తుని ఆహ్వానించవచ్చా?

About this Plan

యేసుతో ముఖాముఖి

మనతోనూ, మనలోనూ తన నివాసాన్ని చేసుకొన్న మన నిత్యుడైన దేవుని గురించి పరిచితమైన సత్యాలతో మనలను మనం సేదదీర్చుకోడానికి శ్రమల కాలము ఒక గొప్ప సమయం. ఈ బైబిలు ప్రణాళిక ద్వారా, ఇది ఒక దిక్సూచిగా మిమ్ములను సంపూర్ణంగా పూర్తి నూతన స్థాయిలో యేసుతో సమయాన్ని అనుభవించుటకు నడిపించే దేవుని వాక్యముతో ఈ 40 రోజులూ ప్రతి దినం కొన్ని నిమిషాలు వెచ్చిస్తారు అని మా నిరీక్షణ.

More